తిరిగొస్తే పెళ్లి చేస్తా లేదంటే... పేరెంట్స్ ఎంట్రీతో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు!

Published : Jul 13, 2024, 12:44 PM ISTUpdated : Jul 13, 2024, 04:00 PM IST

గత వారం రోజులుగా లావణ్య-రాజ్ తరుణ్ వివాదం టాలీవుడ్ వర్గాల్లో కాకరేపుతుంది. తాజాగా లావణ్య పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. రాజ్ తరుణ్ పెళ్ళికి ఒప్పుకుంటే గ్రాండ్ గా పెళ్లి చేస్తాం లేదంటే పోరాటం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు...   

PREV
16
తిరిగొస్తే పెళ్లి చేస్తా లేదంటే... పేరెంట్స్ ఎంట్రీతో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు!
Raj Tarun and Lavanya


లావణ్య-రాజ్ తరుణ్ ల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య  తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లకు పైగా నాతో సహజీవనం చేసిన రాజ్ తరుణ్ వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్ర తో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మాకు పెళ్లి అయ్యింది. రెండుసార్లు అబార్షన్ అయ్యిందని లావణ్య అంటున్నారు. 


 

26

రాజ్ తరుణ్ నాకు కావాలంటున్న లావణ్య.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్ర లపై కేసు పెట్టింది. లావణ్య ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించారు. ఆమెతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఎలాంటి శారీరక సంబంధం లేదు. నేను లావణ్యను వివాహం కూడా చేసుకోలేదు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది. నన్ను టార్చర్ పెట్టిందని, రాజ్ తరుణ్ వాదిస్తున్నారు. 

36
Raj Tarun and Lavanya

తాజాగా లావణ్య పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. లావణ్య తండ్రి కీలక విషయాలు వెల్లడించాడు. లావణ్య-రాజ్ తరుణ్ రిలేషన్ గురించి మాకు తెలుసు. మా అమ్మాయి మీద ఉన్న విశ్వాసంతో రాజ్ తరుణ్ ని నమ్మాము. రాజ్ తరుణ్ పేరెంట్స్ తో కూడా మాకు సాన్నిహిత్యం ఉంది. ఒకరింటికి మరొకరు రావడం, మాట్లాడుకోవడం జరిగేది. 
 

46
Raj Tarun - Lavanya


మూడు నెలలుగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కలవడం లేదు. బహుశా నెంబర్ మార్చేశారేమో. రాజ్ తరుణ్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా మాతో మాట్లాడటం లేదు. రాజ్ తరుణ్ తో లావణ్యకు పెళ్లి, అబార్షన్ వంటి విషయాలు మాకు తెలుసు. కానీ ఒక అమ్మాయికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు చెప్పుకోలేం కదా. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందన్న ఆరోపణల్లో నిజం లేదు. 
 

56

మా అమ్మాయి ఎలాంటిదో మాకు బాగా తెలుసు. ఆమెకు కనీసం చాక్లెట్ ఎలా తినాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందా? లావణ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సమాచారం. ఆమెకు ఏదైనా అయితే మేము కూడా ఉండం. తిరిగి వస్తే పెళ్లి చేస్తాము. లేదంటే పోరాటం తప్పదని.. అన్నారు. 


 

66
Raj Tarun and Lavanya

రాజ్ తరుణ్ తో లావణ్య పేరెంట్స్ కి గట్టి పరిచయం ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు కలవడం మాట్లాడుకోవడం జరిగేదని తాజాగా పరిణామాలతో స్పష్టం అవుతుంది. 2008లో సోషల్ మీడియా ద్వారా జరిగిన పరిచయం ప్రేమగా మారిందని లావణ్య అంటున్నారు. 

click me!

Recommended Stories