Jailer 2: టైగర్ మళ్ళీ వస్తున్నాడు ... జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?

Published : Jul 02, 2026, 07:34 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు  సంబరాలు మొదలుపెట్టేశారు. ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే? 

PREV
14
హుకుం... టైగర్ కా హుకుం

'హుకుం... టైగర్ కా హుకుం!' డైలాగ్ మళ్ళీ థియేటర్లలో మోగనుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది.

24
రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడు?
డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'జైలర్ 2' సినిమా 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగంలో రిటైర్డ్ జైలర్‌గా కనిపించిన ముత్తువేల్ పాండియన్, ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా రాబోతున్నాడు.
34
ఎవరెవరు నటించారంటే?
ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్ణా, ఎస్.జె. సూర్య వంటి స్టార్స్ నటిస్తున్నారు. 'జైలర్' సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన నెల్సన్-అనిరుధ్ కాంబో ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారు.
44
భారీగా పెరిగిన అంచనాలు..

ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 2023లో వచ్చిన 'జైలర్' భారీ విజయం సాధించడంతో, సీక్వెల్ కోసం అభిమానులు  చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ రావడంతో అన్ని భాషల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

Read more Photos on
click me!

Recommended Stories