Chingari Song: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన `వింటారా సరదాగా` మూవీ నుంచి అదిరిపోయే సెకండ్ సాంగ్ విడుదలైంది. ఈ పాట వింటే లవర్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.
అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `వీసా-వింటారా సరదాగా`. `హీరో`, `దేవకి నందన వాసుదేవా` వంటి చిత్రాలతో అశోక్ గల్లా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆయా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. అశోక్ గల్లాకి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఇప్పుడు `వింటారా సరదాగా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో ఆయనకు జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
24
అలరిస్తోన్న వీసా రెండో పాట చింగారి
నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ పాట విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు `చింగారి` పేరుతో రెండో పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని, తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు. సనారే రచించిన 'చింగారి' పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది.
34
విదేశాల్లో తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరించే వీసా
'VISA - వింటారా సరదాగా' నుంచి విడుదలైన టీజర్ ఒక సరికొత్త కథనంతో, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్నేహం, ఆశయాలు, సాంస్కృతిక గుర్తింపు, ఊహించని ప్రేమ వంటి అంశాలను నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా సరికొత్తగా ఆవిష్కరించనుంది. తొలి గీతం 'అనగనగా అమెరికా' ఒక హుషారైన పాటగా నిలిచి, అన్ని మాద్యమాల్లో అందరి మనసులను గెలుచుకుంది. సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి, విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా 'VISA - వింటారా సరదాగా'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు విడుదలైన 'చింగారి' పాటతో ఈ చిత్రం తనలోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించింది. హృదయాన్ని తాకే స్వరాలు, సాహిత్యంతో ఈ పాట సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీసే అభిరుచి గల నిర్మాతలు కావడంతో 'VISA - వింటారా సరదాగా'పై నమ్మకం మరింత పెరిగింది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరింత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది.