Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి జైలర్ 2.. 1000 కోట్ల కలెక్షన్లకు బ్రేకులు.. అది ఇక కలే

Published : Nov 05, 2026, 05:52 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్, ఎస్.జె.సూర్య, విద్యాబాలన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'జైలర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

PREV
14
జైలర్‌ 2 థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌

రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు అంతా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వాళ్లు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఎస్‌ జే సూర్య, విద్యా బాలన్‌, మిథున్‌ చక్రవర్తి, యోగిబాబు, రమ్యకృష్ణ, సూరజ్‌తోపాటు గెస్ట్ రోల్స్ లో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో, ఈ సీక్వెన్స్ కూడా అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

24
కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా జైలర్‌ 2

జైలర్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో రజనీకాంత్ తన కొడుకుని కాల్చినట్లు చూపించారు. కానీ అక్కడ కేవలం తుపాకీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అసలు కొడుకు ఏమయ్యాడు అనే సస్పెన్స్‌తో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ కథకు కంటిన్యూయేషన్‌గా వచ్చిన ఈ సినిమాలో కూడా పాత స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

34
జైలర్‌ 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్లలో సినిమా చూసిన అభిమానులు, ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, జైలర్ 2 సినిమా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో ఈ బ్లాక్‌బస్టర్‌ను చూసేయొచ్చు.

44
వెయ్యి కోట్లకు బ్రేక్‌

జైలర్ ఫస్ట్ పార్ట్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉంది. జైలర్ 2 సినిమా ఇప్పటివరకు రూ.820 కోట్లకు పైగా వసూలు చేసింది. దీపావళి తర్వాత కూడా థియేటర్లలో రన్ చేసి 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని ఓనర్లు ప్లాన్ చేశారు. కానీ సడెన్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఆ 1000 కోట్ల కలెక్షన్ల కలకు బ్రేక్ పడింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ 900 కోట్లతో ఆగిపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కోలీవుడ్‌కి వెయ్యి కోట్లు అనేది కలగానే మిగిలిపోనుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories