Dakkshi Remuneration: వచ్చిన రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ అయిన దక్షికి దక్కే పారితోషికం ఎంతంటే?

Published : Oct 26, 2026, 06:28 AM IST

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టిన నటి దక్షి రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ అయ్యింది. మరి ఆమె రెండు వారాలకుగానూ ఎంత పారితోషికం తీసుకుందనేది చూస్తే..

PREV
13
దక్షి రెండు వారాల పారితోషికం

బిగ్ బాస్ తెలుగు 10లో ఏడో వారం ఎలిమినేషన్ వార్తలు ఆసక్తికరంగా మారాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన దక్షి గుత్తికొండ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె ఎలిమినేషన్‌తో పాటు తీసుకున్న పారితోషికం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, దక్షికి వారానికి సుమారు రూ.2.5 లక్షల పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె రెండు వారాల పాటు హౌస్‌లో ఉంది. దీంతో ఆమెకి రూ.5 లక్షలు దక్కబోతున్నట్టు తెలుస్తోంది.

23
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినా.. నిరాశపరిచిన గేమ్!

బిగ్ బాస్ తెలుగు 10లో దక్షి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఐదో వారంలో హౌస్‌లోకి అడుగుపెట్టింది. అప్పటికే హౌస్‌లో పోటీ రసవత్తరంగా మారడంతో, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షి ఎంట్రీతో గేమ్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఆమె కంటెంట్‌ ఇవ్వడంలో విఫలమయ్యింది.

33
దక్షి ఎలిమినేషన్‌కు కారణాలివేనా?

నటి దక్షి ఎందుకు ఎలిమినేట్‌ అయ్యింది. ఆమెకి తక్కువ ఓట్లు రావడానికి కారణాలు చూస్తే, ఆమె ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కంటెంట్‌ ఇవ్వలేకపోయింది. కెమెరాలో ఎక్కువగా కనిపించలేదు. అంతేకాదు అసలు హౌజ్‌లో ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది. ఎక్కడా కూడా యాక్టివ్‌గా కనిపించలేదు. దీని కారణంగానే ఆమెకి ఓట్లు తక్కువగా పడ్డాయని సమాచారం. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా రావడంతో ఆడియెన్స్ కి తానేంటో ఇంకా తెలియలేదు. తాను కూడా ఆ స్థాయిలో కంటెంట్‌ ఇవ్వలేకపోవడంతో ఆమెకి తక్కువ ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా వచ్చిన రెండు వారాల్లోనే హౌజ్‌ని వీడింది దక్షి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories