చెన్నై శ్రీ బృందా థియేటర్ మూత: చెన్నైకి గుర్తుగా ఉన్న థియేటర్లు వరుసగా మూతపడటం అభిమానులను బాధపెడుతోంది. కొద్దిరోజుల కిందట చెన్నై అశోక్ పిల్లర్ ఏరియాలో నడుస్తున్న ఉదయం థియేటర్‌ను పూర్తిగా కూల్చివేసి అక్కడ అపార్ట్‌మెంట్ కడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో మరో పేరుగాంచిన శ్రీ బృందా థియేటర్ తన ప్రయాణాన్ని ఆపేసింది.