అయితే రాజేంద్రప్రసాద్ 80 వ దశకం నుంచే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఆ ఒక్కటీ అడక్కు, అహనా పెళ్ళంట, రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ నటించారు. అయితే ఆయన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదట. ఇబ్బంది కూడా పెట్టలేదు. నా రేంజ్ ని నేను లెక్క వేసుకోలేదు. ఇచ్చినంత పుచ్చుకున్నాను. ఆ డబ్బుతోనే ఆస్తులు సంపాదించా అని రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.