‘బాహుబలి 3’పై స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్‌,జరిగే పనేనా?

First Published | Oct 17, 2024, 12:26 PM IST

గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. మూడో భాగం ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు.

Baahubali 3 , rajamouli, Kanguva, prabhas

దర్శకధీరుడు రాజమౌళి  క్రియేట్ చేసిన అద్భుతం ‘బాహుబలి’అని చెప్తూంటారు అభిమానులు. ప్రభాస్‌ (Prabhas), అనుష్క ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్‌ చిత్రాలు తెలుగు చిత్రపరిశ్రమ గురించి ప్రపంచానికి చెప్పింది.

 ‘బాహుబలి’ రెండు భాగాలూ మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లు వసూలుచేయడంతో దీని మూడో పార్ట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై ఆసక్తికర కామెంట్ చేశారు. ‘కంగువా’ సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ‘బాహుబలి 3’ ప్రస్తావనను తీసుకొచ్చారు.
 


ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్​లో(Kanguva ) భాగంగా జ్ఞానవేల్‌ మాట్లాడుతూ ‘గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. మూడో భాగం ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు.దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ రిలీజ్‌ అవుతాయి అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాహుబలి - 3 కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.



ఇక ఆ మధ్య రాజమౌళి ఈ బాహుబలి 3 గురించి మాట్లాడుతూ బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈ సారి చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. అని చెప్పుకొచ్చారు.  బాహుబలి 3 కనుక వస్తే క్రేజ్ మాత్రం ఓ రేంజిలో ఉంటుందనేది నిజం.

అలాగే బాహుబలి 3 రావటానికి సమయం కూడా పడుతుంది. మహేష్ ప్రాజెక్టు  పూర్తయ్యాక రాజమౌళి ఈ ప్రాజెక్టు టేకప్ చేస్తారా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి వెనక్కిు వచ్చి మళ్లీ బాహుబలి 3 చేస్తాడనేది మాత్రం నమ్మలేం అని చెప్పేస్తున్నారు. 
 

 ప్రస్తుతం కంగువా (Kanguva)  తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న ప్రాజెక్టు. దర్శక నిర్మాతలు ఈ సినిమాపై చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. పక్కా 2000 కోట్ల సినిమా అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు.  

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్య నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత వసూళ్లు సాధిస్తుందనే అంచనాను వ్యక్తం చేశారు. 
 


కె.ఇ.జ్ఞానవేలు మాట్లాడుతూ.. ‘కంగువా’ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ‘కంగువా’ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 2000 కోట్ల వసూళ్లను రాబడుతుందని నిర్మాత తెలిపాడు. దీంతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి.

‘కంగువ’ సినిమా మొత్తం రన్‌టైమ్ 2:26 నిమిషాలు మాత్రమే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.ఆయుధాలు, గుర్రపు స్వారీ మొదలైనవాటిని కనిపెట్టిన కాలం నాటి కథ ఇందులో ఉంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కార్తీ కూడా అతిథి పాత్రలో నటించారు.

Latest Videos

click me!