ఏంటి సందీప్ ఈ షాక్, ప్రభాస్ 'స్పిరిట్​' షాకింగ్ అప్డేట్

First Published | Oct 17, 2024, 1:12 PM IST

ఈ సినిమాలు కాకుండా అభిమానులు మాత్రం స్పిరిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం డైరక్టర్ సందీప్ వంగా కావటమే. 

Sandeep Vanga, Spirit Movie, Prabhas


ప్రభాస్ మంచి ఊపు మీద ఉన్నారు. సక్సెస్ ఆయనకు పర్యాయపరంగా మారింది. రీసెంట్ గా  'కల్కి2898 AD' సినిమాతో మాసివ్ సక్సెస్ అందుకున్న   ప్రభాస్ మరో హిట్ కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్​కు నార్త్​లోనూ మరోసారి ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వాళ్లు కూడా ప్రభాస్  సినిమా వస్తే ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యిపోయే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమమంలో  'కల్కి' తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటి,ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి మొదలైంది.

Sandeep Vanga, Spirit Movie, Prabhas

ఇప్పటికే ప్రభాస్  'కల్కి'తో పాటు ఫౌజీ,  'సలార్ 2', 'రాజాసాబ్​', 'స్పిరిట్​', 'కన్నప్ప' మూవీస్​కు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  'కల్కి' షూటింగ్ టైమ్ లోనే  అప్పుడప్పుడు రాజాసాబ్, కన్నప్ప  సెట్స్​లోనూ సందడి చేసేవారు. అయితే ఈ సినిమాలు కాకుండా అభిమానులు మాత్రం స్పిరిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం డైరక్టర్ సందీప్ వంగా కావటమే. తాజాగా ఈ చిత్రం గురించి స్పెషల్ అప్డేట్స్ బయిటకు వచ్చాయి. అసలు ఊహించని అప్డేట్స్ ఇవి.


Sandeep Vanga, Spirit Movie, Prabhas


ముంబై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సందీప్ వంగా ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రం స్పిరిట్  స్క్రిప్టు దాదాపు పూర్తి చేసేసారు. ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైపోయింది. రెగ్యులర్ షూటింగ్ 2025లో మొదలు కానుంది. అయితే సందీప్ వంగా అక్టోబర్ 2024లో షూట్ మొదలు పెడదామనుకున్నారు.

కాని దాన్ని ఆరు నెలలు పాటు ముందుకు తోసారు. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. దానికి ప్రభాస్ సైతం ఓకే చెప్పారు.ఈ సినిమాలో సందీప్ వంగా స్పెషల్ క్యారక్టరైజషన్ డిజైన్ చెయ్యటమే కాకుండా లుక్ కూడా పూర్తిగా మార్చబోతున్నారు. ఈ మేరకు ఫొటో షూట్ లు సైతం జరిగాయి..ఐదారు రకాలుగా లుక్ లు చూసుకుని ఒకటి ఓకే చేసారు.

Sandeep Vanga, Spirit Movie, Prabhas

 ఈ సినిమా పై షాకింగ్ అప్డేట్ ఏమిటంటే...ఈ సినిమాలో ప్రబాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. బాహబలి తర్వాత ప్రభాస్ డ్యూయల్ రోల్స్ లో కనిపించే చిత్రం ఇదే. బాహుబలిలో ఆ రెండు పాత్రలు ఎప్పుడూ కలవవు. సింగిల్ ఫ్రేమ్ లో కనపడవు. కానీ స్పిరిట్ లో రెండు పాత్రలు ఎదురు ఎదురౌతాయని తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ లు ఇద్దరూ కలిసి కనివిందు చేస్తారని తెలుస్తోంది. ఇక ఒక ప్రభాస్ అయితే పోలీస్ గా కనిపించనున్నారు. మరో ప్రభాస్ పాత్ర ఏమిటన్నది తెలియరాలేదు.

Sandeep Vanga, Spirit Movie, Prabhas

ఈ సినిమాలో ప్రభాస్ రూత్ లెస్ పోలీస్ గా కనిపించనున్నారు. అసలు దయ , దాక్షిణ్యం అనేది లేకుండా తను అనుకున్నది చేసుకుంటూ పోతారని తెలుస్తోంది. అలాగే యానిమల్ పాత్ర కన్నా హై డోస్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయని సందీప్ చెప్తున్నారు. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్..సన్నగా , కండలు తిరిగిన శరీరంతో రెడీ కానున్నారు. 

Sandeep Vanga, Spirit Movie, Prabhas


 సందీప్‌ వంగా దర్శకత్వం​లో తెరకెక్కునున్న 'స్పిరిట్‌'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారన్న చెప్పటంతో ఈ  చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది.  అలాగే ఈ సినిమా కథ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.  ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్-సియోక్ (డాన్ లీ) నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

డాన్ లీ  దక్షిణ కొరియాతో పాటు అటు హాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలు చేసారు.డాన్ లీ (Don Lee) అలియాస్ మా డోంగ్ సియోక్ యాక్ష‌న్ సినిమా కేరాఫ్ ఎడ్రస్.  'ట్రైన్ టూ బూసన్' తో  వ‌ర‌ల్డ్ వైడ్‌గా హీరోగా అవతరించాడు. మార్వెల్ (Marvel) మూవీస్‌లో డాన్ లీ న‌టించాడు.  ముఖ్యంగా ఆయన నటించిన 'ది ఔట్‌లాస్', 'ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్', 'అన్‌స్టాపబుల్', 'ఛాంపియన్', వంటి సినిమాలు మన తెలుగు వాళ్లకు కూడా పరిచయమే. 

Latest Videos

click me!