Rajeev Kanakala: రూ.10 వడ్డీకి అప్పులు కట్టాను, సుమతో పెళ్లి తర్వాత రాజీవ్ కనకాల జీవితంలో ఏం జరిగిందో తెలుసా?

Published : Nov 11, 2026, 07:48 AM IST

Rajeev Kanakala: స్టార్ జంటగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల, సుమ. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాజీవ్.. కెరీర్ బిగినింగ్ లో డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? సుమతో పెళ్లి తరువాత ఏం జరిగింది? ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఏంటి?

PREV
13
నటుడిగా ప్రత్యేక గుర్తింపు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala). తెరపై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఆయన, నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన విషయాలు అందరిని ఆశ్చర్చానికి గురి చేస్తున్నాయి. తన గత జీవిత జ్ఞాపకాలు, ఆర్థిక కష్టాలు.. ఆ కష్టాల నుంచి రాజీవ్ వివరంగా వెల్లడించారు.

పెళ్లి సమయంలో ఆర్థిక ఇబ్బందులు

రాజీవ్ కనకాల తన పెళ్లి తర్వాత రోజులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు పెళ్లి అయ్యి సుమ ఇంటికి వచ్చేసరికి పెద్దగా ఫైనాన్షియల్ క్రైసిస్ లేకపోయినా, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు (Financial Constraints) మాత్రం ఉండేవని ఆయన తెలిపారు. తాను అప్పటికే బిజీగా ఉన్నప్పటికీ, తన జీవితం మాత్రం ‘మైనస్’ నుంచి ప్రారంభమైందని అన్నారు. తమ కుటుంబానికి గతంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల భారీ మొత్తంలో అప్పులు అయ్యాయని, వాటికి చాలా సంవత్సరాల పాటు వడ్డీలు కడుతూనే ఉన్నామని ఆయన గుర్తు చేసుకున్నారు.

23
ఐదు, పది రూపాయల వడ్డీలు కట్టిన రోజులు

ఆర్థిక భారాన్ని వివరిస్తూ.. తాము మూడు వేరియేషన్స్‌లో ఐదు రూపాయలు, పది రూపాయల వడ్డీలను కూడా కట్టినట్లు రాజీవ్ కనకాల తెలిపారు. ఆ అప్పులను, వడ్డీలను క్రమక్రమంగా అసలుతో సహా ఎలా క్లియర్ చేసుకుంటూ వచ్చారో ఆయన వివరించారు. మోతినగర్‌లో ఉన్న ఆ రోజుల్లో, రాత్రి పూట తన భార్య సుమ, తాను ఇద్దరూ కలిసి కూర్చుని ప్రతి చిన్న ఖర్చును డైరీలో రాసుకునేవారమని ఆయన తెలిపారు.

ఇంట్లో రెంట్ ఎంత, ఉప్పు, పప్పుల ఖర్చులు ఎంత, కరెంట్ బిల్లు ఎంత అనే ప్రతి వివరాలను నోట్ చేసుకునేవారమని చెప్పారు. అలా వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలో ప్లాన్ చేసుకునేవారమని, అప్పట్లోనే తాము ఇన్కమ్ టాక్స్ కూడా కట్టేవాళ్లమని రాజీవ్ పేర్కొన్నారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మైనస్ నుంచి జీరోకి, అక్కడి నుంచి ప్లస్ స్టేజ్‌కి చేరుకున్నామని తెలిపారు.

33
సంపాదన పెరిగేకొద్దీ పెరుగుతున్న బాధ్యతలు

జీవితంలో ఎదుగుదల గురించి చెప్తూ.. సంపాదన పెరిగేకొద్దీ బాధ్యతలు, సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని రాజీవ్ కనకాల అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రోజుకు తక్కువ మొత్తంలో సంపాదించినప్పటికీ ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నామని, కానీ నేడు లక్షల్లో సంపాదించినప్పటికీ మనిషి పెట్టుకునే కమిట్మెంట్స్ బట్టి సమస్యలు కూడా అలానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కష్టకాలం నుంచి ఈ స్థాయికి రావడం తనకు చాలా గొప్ప విజయంగా అనిపిస్తుందని ఆయన తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories