విడిగా ఉన్న మాట నిజమే, సంపాదన విషయంలో విబేధాలు లేవు... స్టార్ యాంకర్ అంటే ఒప్పుకోను!

First Published Jul 26, 2021, 6:00 PM IST

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాలతో విడిపోనున్నారని, వారి మధ్య విబేధాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై సుమ, రాజీవ్ నోరు మెదపలేదు. 
 

అయితే ఈ పుకార్ల అనంతరం ఓ టెలివిజన్ ప్రోగ్రాం లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. తమ మధ్య విబేధాలు ఉన్నాయని, వీడిపోతున్నాయనే విషయంలో వాస్తవం లేదని, ఇద్దరూ ఆ ప్రోగ్రాం సాక్షిగా ఎమోషనల్ అయ్యారు. సుమ రాజీవ్ ని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు.
undefined
అలా వార్త కథనాల్లో నిజం లేదని వారు పరోక్షంగా సందేశం ఇచ్చారు. నిప్పు లేనిదే పొగరాదు. కాబట్టి వీరి మధ్య ఎంతో కొంత మేర గొడవలు జరిగాయని, అందుకే ఆ వార్త కథనాలు పుట్టుకు వచ్చాయని కొందరు భావిస్తున్నారు.
undefined
దీనితో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ ని యాంకర్ సూటిగా ఈ ప్రశ్న అడిగారు. సుమతో విభేదాలు విషయంపై మీరు క్లారిటీ ఇవ్వాలని కోరారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ విడివిగా ఉన్న మాట వాస్తవమే అని తెలియజేశారు.
undefined
సుమతో విడిగా వేరే ఇంటిలో ఉండడానికి కారణం చెబుతూ అమ్మ మరణం తరువాత నేను నాన్నగారితో పాటు మణికొండలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యాను. నాన్నకు సంబంధించిన పెద్ద పుస్తకాల లైబ్రరీ ఉండేది. దాన్ని సుమతో పాటు ఉన్న ఇంటిలో ఉంచడానికి సరైన ప్లేస్ లేదు.
undefined
అలాగే కొన్ని అనవసర ఖర్చులు తగ్గించడానికి నేను వేరుగా మణికొండలో ఉన్నాను. దాన్ని మీడియా పెద్దదిగా చేసి, మా మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించారు అన్నారు.
undefined
అలాగే సంపాదన విషయంలో కూడా మీ మధ్య విబేధాలు వచ్చాయట కదా.. అని అడుగగా, ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరు తక్కువ సంపాదిస్తున్నారు అనే డిస్కషన్ మా మధ్య అసలు ఎప్పుడూ రాలేదని, కనకాల అన్నారు.
undefined
మీలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారన్న మరో ప్రశ్నకు రాజీవ్ కనకాల ప్రస్తుతం ఆమె సంపాదన ఎక్కువ, ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా నా సంపాదన ఎక్కువ అన్నారు. అప్పట్లో నా సంపాదనతో ఆస్తులు కూడబెట్టాను అన్నారు రాజీవ్.
undefined
బుల్లితెరపై ఒక స్టార్ హీరో సుమ అని యాంకర్ అన్నారు.  దానిని నేను ఒప్పుకోను అన్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి యాంకర్స్ కూడా బుల్లితెరపై తమ మార్కుతో దూసుకుపోతున్నారని, ఎవరి ప్రత్యేకత వారిది అంటూ రాజీవ్ తెలియజేశారు.
undefined
click me!