2020 డిసెంబర్ 9న నిహారిక, వెంకట చైతన్య జొన్నలగడ్డ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ మెగా వేడుకకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక కాగా, మెగా హీరోలందరూ హాజరై సందడి చేశారు.
పవన్ కళ్యాణ్ నుండి అల్లు శిరీష్ వరకు ప్రతి ఒక్క మెగా హీరో, నిహారిక పెళ్లి వేడుకకు హాజరు కావడంతో ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఐదు రోజుల పాటు ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక వివాహం ఘనంగా జరిగింది.
ఇక పెళ్ళైన తరువాత భర్త చైతన్య మొదటి బర్త్ డేకు నిహారిక తనదైన శైలిలో బర్త్ డే విషెష్ తెలియజేశారు. చైతూను ముద్దాడుతున్న ఫోటో పంచుకోవడంతో పాటు, చైతూ హ్యాబిట్స్, డైలీ లైఫ్ ని చాలా క్యూట్ గా వివరించింది.
'నీ ఛండాలమైన సినిమాల ఎంపిక, ప్రతి నెలా వంట పేరుతో చేసే ప్రయోగాలు, కాఫీ పట్ల పిచ్చి ప్రేమ, అర్థరాత్రి ఆకలి, థీమ్ పార్టీస్ పట్ల నీకుండే డెడికేషన్, నీ సిల్లీ రియాక్షన్స్, ప్రశాంతమైన వ్యక్తిత్వం, చివరిగా నీకున్న అద్భుతమైన హస్బెండ్ క్వాలిటీస్.. నా మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. హ్యాపీ బర్త్ డే హస్బెండ్' అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో విషెష్ పోస్ట్ చేశారు.
తనకు దొరికిన గొప్ప భర్తగా చైతూను వర్ణించిన నిహారిక, తనపై ఆయన చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. నిహారిక ట్వీట్ కి మెగా హీరోలైన కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ స్పందించారు. వారు కూడా చైతన్యకు తమ బెస్ట్ విషెష్ తెలియజేశారు.
పుట్టింట్లో కంటే అత్తింట్లోనే తానూ స్వేచ్ఛా జీవితం గడుపుతున్నట్లు నిహారిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. తొమ్మిది గంటలు గడుస్తున్నా అత్తింట్లో తనను ఎవరూ నిద్ర లేపరని, అత్తయ్య కూతురులా చూసుకుంటున్నారని చెప్పడం విశేషం.
ఇక పెళ్లి తరువాత నిహారిక నటనకు గుడ్ బై చెబుతుందని అందరూ భావించారు. కానీ చైతన్య ఆ విషయంలో ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వడంతో నటన కొనసాగిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి జంటగా ఆమె నటించిన ఓ మూవీ విడుదల కావాల్సి ఉంది.
అలాగే తెలుగులో ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటుంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ నిహారిక త్వరలో ప్రకటించే అవకాశం కలదు.
ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారిన నిహారిక సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు నటిగా బ్రేక్ రాకపోవడంతో పెళ్లి చేసుకోవడం జరిగింది.