యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయాని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో రాజీవ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. తారక్ ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఈసినిమా అయిపోయిన తరువాత ఎన్టీఆర్ తో రాజీవ్ ఓ మాట అన్నారు.. ''నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను.. నన్ను కూడా మార్చిపోవు కదా'' అని అడిగారు. దానికి ఎన్టీఆర్ కూడా '' నేను కూడా నిన్ను మర్చిపోను.. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం'' అని మాటిచ్చారు. అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కనిపిస్తుంటారు. సినిమాల్లో మాత్రమే కాదు.. ఇద్దరు కలిసి గతంలో ఎన్నో టూర్లు వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరైన సందర్భాలు ఉన్నాయి.
25
ఇద్దరి మధ్య విభేదాలు
దాదాపు 25 ఏళ్లుగా ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం కొనసాగుతోంది. ఈ ఇద్దరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు కొన్ని రూమర్స్ గతంలో వైరల్ అయ్యాయి. అశోక్ సినిమా టైమ్ లో వీరిమధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమా విషయంలో వీరిద్దరు మాట మాట అనుకున్నారని టాక్. అయితే ఈ విషయంలో పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇస్తూ వచ్చారు రాజీవ్ కనకాల. కానీ ఆయన ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్న మాత్రం వదలిపెట్టడం లేదు. రీసెంట్ గా కూడా ఈ విషయంలో రాజీవ్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
35
రాజీవ్ కు ఫోన్ చేసిన తారక్
ఎన్టీఆర్ తో విభేదాల విషయంలో క్లారిటీ ఇస్తూ.. రాజీవ్ కనకాల ఈ విధంగా వెల్లడించారు. '' నాకు అర్ధం కావడంలేదు.. మాకే తెలియకుండా మా మధ్య గొడవలు ఎప్పుడు జరిగాయి..ఇప్పుడే కాదు ఇలాంటివి గతంలో కూడా చాలా వచ్చాయి.. ఓ ఏడేనిమిదేళ్ల క్రితమే ఇలాంటి వార్త ఒకటి స్టార్ట్ అయ్యింది. అది బాగా వైరల్ అయ్యింది. అప్పుడు నేను వెంటనే తారక్ కు ఫోన్ చేసి.. ఇదిగో ఇలా వస్తుంది.. ఏంటి, ఏంచేయాలి అని అడిగాను. వెంటనే తారక్ .. కంగారు పడకు.. ఇలాంటివి కామన్ గా వస్తుంటాయి, ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి.. నీ దగ్గరకు కూడా వచ్చి అడుగుతారు.. కానీ కంగారు పడకు, వాటిని పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు.. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. అస్సలు పట్టించుకోవద్దు..'' అని ఎన్టీఆర్ ముందే చెప్పినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు.
ఈ విషయంపై గతంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజీవ్ కనకాల. ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదులుకోను.. నన్ను దూరం పెట్టాలని భావిస్తే అది వారి ఇష్టం, ఎన్టీఆర్ కు, నాకు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే, నాకు, ఎన్టీఆర్ కు విధేదాలు ఉంటే.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో ఎందుకు నటిస్తాను అని రాజీవ్ కనకాల ప్రశ్నించాడు. అలాగని ఎన్టీఆర్ ప్రతి సినిమాలో నేను నటించాలంటే కుదరదు. అది దర్శకుల ఛాయిస్ అని కనకాల తెలిపాడు. ఎన్టీఆర్ నాకన్నా వయసులో చిన్నవాడు. మా ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని రాజీవ్ కనకాల గతంలోనే తెలిపాడు.
55
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..
పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ బిజీ అయిపోయాడు. దేవర,వార్2 లాంటి వరుస సినిమాలతో సందడి చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. దేవర పార్ట్ 2 లో జాయిన్ అవ్వబోతున్నాడు తారక్. ఇక మరో వైపు రాజీవ్ కనకాల విషయం చూసుకుంటే.. టాలీవుడ్ లో రాజీవ్ కు నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజీవ్ కనకాల మునుపటిలా ఎక్కువ చిత్రాలు చేయడం లేదు. కానీ అప్పుడప్పుడూ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.