64 ఏళ్ల వయస్సులోనూ యంగ్ గా కనిపించే నాగార్జున తన ఫిట్‌నెస్, ఫుడ్ హ్యాబిట్స్ రహస్యాన్నిరివీల్ చేశారు. ఆరు పదుల వయసులో తనకి ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యం అవుతోంది ? తినే ఫుడ్ ఏంటి ? తినని ఫుడ్ ఏంటి ? ఇలా ప్రతి విషయాన్ని కింగ్ నాగ్ బయటపెట్టారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున 64 ఏళ్ల వయస్సులోనూ తన యుంగ్ లుక్ ని, ఫిట్‌నెస్‌ను అద్భుతంగా కాపాడుకుంటున్నారు. క్రమశిక్షణతో కూడిన ఆయన జీవన శైలి, ఫిట్‌నెస్ పై శ్రద్ద, ఆహారపు అలవాట్లు ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన ఆరోగ్య రహస్యాలను కంప్లీట్ గా బయటపెట్టారు.
25
నాగార్జున తినని ఒకే ఒక్క ఆహార పదార్థం
నాగార్జున మాట్లాడుతూ.. “నేను ఒక్కటి తప్ప మిగిలిన అన్ని ఆహార పదార్థాలు తింటాను. నా డైట్‌లో బ్రౌన్ రైస్, పెరుగు, ఊరగాయ, ఆకుకూరలు, చికెన్ లేదా ఫిష్ తప్పనిసరిగా ఉంటాయి. నేను నా శరీరాన్ని ఆహారం విషయంలో ఇబ్బంది పెట్టను. ఎలాంటి ఉపవాసాలు లేదా ఆహార నిషేధాలు పెట్టుకోను” అని చెప్పారు. తాను ముట్టుకోని ఆహార పదార్థం వైట్ రైస్ మాత్రమే అని నాగార్జున అన్నారు. వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ తింటానని అన్నారు. తన డైట్ సూత్రం గురించి ఆయన ఇంకా చెప్పినది – “మన శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలి. ఎక్కువగా సహజ ఆహారం, తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. వయస్సు పెరిగినా శక్తి తగ్గదు” అని చెప్పారు.
35
నాగార్జున ఫిట్ నెస్ మంత్ర ఇదే..
నాగార్జున తాను ప్రతిరోజూ గంట సమయం వ్యాయామానికి కేటాయిస్తారని తెలిపారు. ఫిట్‌గా ఉండటానికి శరీరాన్నీ, మనసుని సరిగ్గా ఉంచుకోవాలి. నిద్ర, ఆహారం, వ్యాయామం ఈ మూడింటినీ తగిన విధంగా నిర్వహిస్తే వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అవుతుంది” అని నాగార్జున తరచూ అంటుంటారు. అదే విధంగా అనవసరమైన టెన్షన్స్ ని మైండ్ లోకి రానివ్వనని తెలిపారు.
నాగార్జున ఇటీవల నటించిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అంతకు ముందు నాగార్జున ‘కుబేరా’ చిత్రంలో కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా ఆయన మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
55
100వ సినిమాపై ఆసక్తి
సినీ అభిమానులు ఇప్పుడు ఆయన 100వ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివరాలను నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికే 100కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ లో ఆ క్లబ్ లో చేరబోయే సీనియర్ హీరో నాగార్జునే.