యాంగ్రీ హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్న విభేదాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ విమర్శల తో విరుచుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ మాట్లాడుతూ చిరంజీవి ఫ్యామిలీ ప్రవర్తించే విధానం తమకు నచ్చదని ఆరోపణలు చేశారు.