ANR: నాగార్జునని పొగడడం అప్పటి వరకు జరగదు, అలాంటి సినిమాలు చేస్తేనే.. సొంత కొడుక్కే షాకిచ్చిన ఏఎన్నార్

Published : Oct 28, 2026, 06:30 AM IST

తాను కోరుకున్న సినిమాలు చేసే వరకు నాగార్జునని పొగడనని ఏఎన్నార్ స్వయంగా చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారు, ఇంతకీ ఆయన కోరుకున్న సినిమాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
ANR

అక్కినేని నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ఏఎన్నార్ వారసత్వంతో హీరోగా పరిచయమైన నాగార్జునకి కెరీర్ ఆరంభంలో విమర్శలు తప్పలేదు. కొన్ని సినిమాలు నాగార్జునని విమర్శలపాలు చేశాయి. దీనికి తోడు నటించడానికి బలమైన కథ, సినిమా దొరకలేదు. గీతాంజలి, శివ లాంటి సినిమాలతో నాగార్జున లోని నటుడు నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభించారు.

25
నా లైన్ లోకే వస్తున్నాడు అనుకున్నా

నాగార్జున గురించి ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మజ్ను, గీతాంజలి సినిమాలు చూసినప్పుడు నాగార్జున నా లైన్ లోకే వస్తున్నాడు అని అనిపించింది. హలో బ్రదర్ సినిమా టైంకి నాగార్జునకి ఒక ఈజ్ వచ్చేసింది. స్టార్ గా ఎమర్జ్ అయ్యాడు.

35
నాగార్జునని పొగడాలి అంటే అది జరగాలి

ఓ సినిమా ఈవెంట్ లో నాగార్జున గురించి మద్రాస్ లో నేను చెప్పాను. నాగార్జున బాగానే చేస్తున్నాడు. కానీ నేను అతడిని పొగిడే రోజు రావాలి అంటే.. ఒక దేవదాసు, ఒక విప్రనారాయణ, భక్త తుకారాం లాంటి సినిమాలు చేయాలి అని చెప్పాను.

45
నాగార్జున పరిపూర్ణ నటుడు అయింది

దానికి తగ్గట్లుగానే నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలు చేశాడు. ఆ సినిమాలు చూసిన తర్వాత నాలో ఇక ఎలాంటి అనుమానం లేదు. నాగార్జున పరిపూర్ణ నటుడు అని ఫిక్స్ అయినట్లు ఏఎన్నార్ తెలిపారు. అన్నమయ్య సినిమాకు ముందు నాగార్జునని చాలా మంది విమర్శించారు. నేను కెరీర్ బిగినింగ్ లో కొన్ని పాత్రలు చేస్తుంటే.. ఈ రోల్ కి ఇతడేం సరిపోతాడు అనే విమర్శలు ఎదురుకొన్నాను. కానీ నటించి చూపించాను. అన్నమయ్యతో నాగార్జున కూడా అదే చేశాడు అని ఏఎన్నార్ అన్నారు.

55
నాగార్జున పేరు వెనుక కథ

నాగార్జునకి ఆ పేరు పెట్టడం వెనుక కూడా పెద్ద కథే ఉందని ఏఎన్నార్ అన్నారు. నా పేరు నాగేశ్వరరావు. మా అమ్మకి నేను పుట్టకముందు ఒక కల వచ్చిందట. కలలో పాము కనిపించింది. దీనితో నేను పుట్టాక నా పేరు నాగేశ్వరరావు అని పెట్టింది. ఆ తర్వాత నాగ అనే సెంటిమెంట్ ని నా భార్య కంటిన్యూ చేసింది. నాగ అని వచ్చేలా, అదే విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని అతడికి నాగార్జున అని పేరు పెట్టాం అని ఏఎన్నార్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories