సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. యాంగ్రీ స్టార్ అనే గుర్తింపు కూడా ఆయనకు ఉంది. అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు రాజశేఖర్ ఖాతాలో ఉన్నాయి. కానీ ఆ తర్వాత రాజశేఖర్ రేసులో వెనకబడిపోయారు. ఇటీవల దశాబ్దం నుంచి రాజశేఖర్ కెరీర్ నెమ్మదించింది.