అంకుశం, ఆహుతి, మగాడు లాంటి చిత్రాల్లో జీవిత, రాజశేఖర్ కలసి నటించారు. వీరిద్దరూ అన్యోన్య దాంపత్యం సాగిస్తూ తమ పిల్లలు శివాని, శివాత్మిక లని ఇండస్ట్రీలో స్టార్స్ గా తీర్చిదిద్ధేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జీవిత, రాజశేఖర్.. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలయింది అనే షోలో పాల్గొన్నారు.