రష్మిక బర్త్ డేకు విజయ్ దేవరకొండ గిఫ్ట్? మరోసారి డేటింగ్ రూమర్లు.. స్పందించిన నేషనల్ క్రష్..

First Published | Apr 6, 2023, 1:52 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా నేషనల్ క్రష్ నిర్వహించిన లైవ్ సెషనే ఇందుకు ఆధారమైంది. బర్త్ డే సందర్భంగా ఇద్దరు కలిశారని ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
 

‘గీతాగోవిందం’ చిత్రం మొదలు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు నేటికీ  కొనసాగుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ‘గీతాగోవిందం’తో పాటు ‘డియర్ కామ్రేడ్’లో నటించారు. 
 

చేసింది రెండు సినిమాలే అయినా వెండితెరపై ఈ పేయిర్ కు మంచి క్రేజ్ ఉంది. విజయ్, రష్మిక కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లనూ ఎంజాయ్ చేస్తున్నారు. 


ఇప్పటికే బెంగళూరులోని ఓ హోటల్,  మాల్దీవ్స్ వేకేషన్, న్యూ ఈయర్ సెలబ్రేషన్స్, ఆయా పండుగలకు వీరిద్దరూ కలుస్తున్నారని ఏకంగా వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రష్మిక విజయ్ ఫ్యామిలీ వేకేషన్ లోనూ జాయిన్ అయ్యిందంటూ పలు ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. 
 

ఫ్యాన్స్ కు 2023 న్యూ ఈయర్ విషెస్ చెప్పేందుకు రష్మిక  ఇన్ స్టా లైవ్ కు వచ్చింది. అప్పుడు విజయ్ వాయిస్ తో దొరికిపోయింది. మళ్లీ నిన్నతన పుట్టిన రోజు సందర్భంగా  తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థ్యాంక్యూ చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది. అంతే మళ్లీ విజయ్ - రష్మిక  డేటింగ్ రూమర్లు తెరపైకి వచ్చాయి.  
 

రష్మిక విడుదల చేసిన థ్యాంక్యూ వీడియోలోని బ్యాక్ గ్రౌండ్, తాజాగా నెట్టింట చేరిన విజయ్ దేవరకొండ ఓ ఫొటోలోని బ్యాక్ గ్రౌండ్ సేమ్ గా ఉంది. దీంతో బర్త్ డే సందర్భంగా రౌడీ హీరో నేషనల్ క్రష్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఓకే చోట ఉండటంతో వీరి మధ్య  డేటింగ్ నిజమేనంటూ.. త్వరలో గుడ్ న్యూస్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.  
 

ఇక కొందరైతే రష్మిక  చూపుడు వేలుకు ఉన్న రింగ్ విజయ్ దేవరకొండ గిఫ్ట్ గా ఇచ్చిందేనని కూడా అంటున్నారు. అయితే దీనిపై సౌత్ డిజిటల్ మీడియా పోస్ట్ పెట్టడంతో రష్మిక స్పందించింది. ‘అయ్యో.. బాబు నువ్వు  అతిగా ఆలోచించకు’ అంటూ రిప్లై ఇచ్చింది. గతంలోనూ పలుమార్లు ఇలాగే రియాక్ట్ అయ్యారు.  కానీ ఎప్పుడూ సీరియస్ గా చెప్పకపోవడం గమనార్హం.
 

Latest Videos

click me!