‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ పై షాకింగ్ రూమర్.. నిజమేనా? ఏమంటున్నారంటే?

First Published | Apr 6, 2023, 1:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.  ఎట్టకేళలకు నిన్న షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే పోస్టర్ పై తాజాగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. 
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లోని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఎట్టకేళలకు ప్రారంభమైంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ  అవుతున్నారు. మరోసారి థియేటర్లు బద్దలేనంటూ సందడి చేస్తున్నారు. బాక్సాఫీస్ షేకే  అంటూ ధీమా వ్యక్తం  చేస్తున్నారు. 
 

షూటింగ్ ప్రారంభంతో పాటు ఫ్యాన్స్ కు బోనస్ గా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. నిలువు తప్పుల నుంచి సూర్య కిరణాలు పవర్ స్టార్ పై పడుతుండగా.. కుర్చీలో కూర్చున్న ‘ఉస్తాద్ భగత్  సింగ్’ బ్యాక్ నుంచి దర్శనమిచ్చారు. పోలీస్ యూనిఫాం లో పవన్ మాస్ స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  


ఒక చేతిలో రివాల్వర్, మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చిన సిట్టింగ్ స్టిల్ కు మాస్ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. కొందరు నెటిజన్లు పోస్టర్ పై షాకింగ్ గా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

తమ అభిప్రాయాల ప్రకారం.. పోస్టర్ లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదంటున్నారు. పోలీస్ యూనిఫాంలో దర్శకుడు హరీశ్ శంకరే పోస్టర్ స్టిల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొన్ని డిటేయిల్స్ ను చూపిస్తూ కొందరు అభిప్రాయపడుతున్నారు. 

‘గబ్బర్ సింగ్’లోనూ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ లాగా ఓ సీన్ లో కనిపించారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అప్పటి  ఫొటోలను కూడా ఇలా నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా పోస్టర్ కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈసారి హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ ను నెక్ట్స్ లెవల్లో చూపించబోతున్నారని  తెలుస్తోంది. 
 

గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా  కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ నిన్న గ్రాండ్ గా మొదలైంది. పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. యంగ్ హీరోయిన్  శ్రీలీలా  (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, శంకర్ నిర్మిస్తున్నారు.  దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!