అప్పుడు దేవి, మా అమ్మని జాగ్రత్తగా చూసుకో, మ అమ్మ చాలా మంచిది. నువ్వుంటే అమ్మకి ధైర్యంగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు భాగ్యమ్మ ,అది సరేగాని నువ్వెందుకు ఈ దుస్తులు వేసుకున్నావు అని దేవి వేసుకున్నా కరాటే బట్టలు గురించి అడుగుతుంది. నేను కరాటే నేర్చుకుంటున్నాను. పెద్దయ్యాక మా నాయన కొట్టడానికి అని అంటుంది.మాధవ్ సార్ పసిపాప మనసులో ఇంత విషయాన్ని నాటాడు అని బాధపడుతుంది భగ్యమ్మ.