ఈ సినిమాలో విలన్ పాత్రల కోసం సౌత్‌స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్‌లతో చర్చలు జరుపుతున్నట్టు టాక్. విజయ్ సేతుపతి హీరోగా, విలన్లుగా, కీలక పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన స్థాయిలో బలమైన పాత్రలైతేనే విలన్‌గా చేస్తున్నారు. `ఉప్పెన`లో ఆయన విలన్‌గా నటించిన విషయంతెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా విలన్‌గా చేస్తున్నారు. ఆయన `పుష్ప`లో ఇప్పటికే విలన్ టచ్ ఇచ్చారు. `పుష్ప2`ఓ పూర్తి విలన్‌గా కనిపించబోతున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ హీరోగా, విలన్లుగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.