అనుష్కని వేధిస్తున్న సమస్య.. నిర్మాతలకు తేల్చి చెప్పేసిందా, నవీన్ పోలిశెట్టి మూవీ మరింత ఆలస్యం ?

Published : May 30, 2022, 01:37 PM IST

అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం.

PREV
16
అనుష్కని వేధిస్తున్న సమస్య.. నిర్మాతలకు తేల్చి చెప్పేసిందా, నవీన్ పోలిశెట్టి మూవీ మరింత ఆలస్యం ?

అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. నిశ్శబ్దం చిత్రం అనుష్క అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. 

26

అనుష్క సినిమాల గురించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగాయి.  బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క గురించి చాలా రూమర్స్ ఎక్కువయ్యాయి. అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందని.. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అనుష్క ప్రస్తుతం ఓ క్రేజీ చిత్రానికి సైన్ చేసింది. 

36

Beauty with Brains: Anushka Shetty is a talent that rarely appears and is a classic example of beauty with brains. Not many people know this but Anushka is a certified Yoga instructor and also hails from a family of Doctors and engineers. That’s not all, her knack for acting sees her as one who is multilinguistic for she can speak fluently in Kannada, Tamil, Telugu, Malayalam, English.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కానీ అనుష్క మాత్రం ఇంకా సెట్స్ లోకి ఎంటర్ కాలేదు. దానికి కారణం అనుష్కని వేధిస్తున్న బరువు సమస్యే. 

46

అనుష్క చాలా కాలంగా బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన అనుష్క ఆస్ట్రేలియాలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. నిశ్శబ్దం చిత్రంలో అనుష్క అవుట్ ఆఫ్ షేప్ లో కనిపించింది. దీనితో తాను బరువు తగ్గిన తర్వాతే సెట్స్ లోకి ఎంటర్ అవుతానని యువీ నిర్మాతలకు అనుష్క తేల్చి చెప్పేసిందట. 

56

ఈ చిత్రంలో ప్రధానంగా అనుష్క నటించాల్సిన సన్నివేశాలే పెండింగ్ లో ఉన్నాయట. అనుష్క చెప్పేసరికి కాదనలేక నిర్మాతలు షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనుష్క గ్లామర్ గా కనిపిస్తూనే హాస్యం పండించబోతున్నట్లు తెలుస్తోంది. 

 

66

ఇదిలా ఉండగా అనుష్క బరువు తగ్గేందుకు మోడ్రన్ వైద్య పద్ధతులకు నో చెబుతోందట. సహజంగానే వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తోంది. దీనితో బాగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories