ఈ గ్యాప్ లో సాల్మన్ రాంచరణ్ ఇంట్రడక్షన్ కోసం తన ఐడియాతో ఒక షూట్ చేసుకుని నాకు చూపించాడు. చాలా క్రేజీగా అనిపించింది. అప్పుడు పక్కనే ఇంత ట్యాలెంట్ పెట్టుకుని హాలీవుడ్ వరకు వెళ్లాం అని అనుకున్నా. మొదట 200 మందితో రిహార్సల్స్ చేసి ఆ తర్వాత 2000 మందితో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ ని సాల్మన్ ఆధ్వర్యంలో చిత్రీకరించినట్లు రాజమౌళి తెలిపారు. ఆ సీన్ లో రాంచరణ్ పెర్ఫామెన్స్, రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా సాల్మన్ కి జాతీయ అవార్డు దక్కింది. ఒక వేళ ఆ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ తోనే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసి ఉంటె సినిమా ఫ్లాప్ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు అని నెటిజన్లు అంటున్నారు.