'కాంతారా'తో ఇరుకున పడ్డా, నన్ను నేను ప్రశ్నించుకున్నా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ 

Published : Dec 12, 2022, 07:47 AM IST

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాత్మక విజయం సాధించింది. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే ఆ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

PREV
16
'కాంతారా'తో ఇరుకున పడ్డా, నన్ను నేను ప్రశ్నించుకున్నా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ 

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాత్మక విజయం సాధించింది. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే ఆ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంతారా మాటే వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని కర్ణాటకలోని తుళు సంప్రదాయం ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన అద్భుతం.

26

 దేవుడి గెటప్ లో వచ్చే శబ్దం థియేటర్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా వెంటాడుతోంది అని చాలా మంది తెలిపారు. రిషబ్ శెట్టి క్లైమాక్స్ లో విభిన్నమైన శబ్దాలు చేస్తూ నట విశ్వరూపం ప్రదర్శించాడు. అదే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. 

36

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు కూడా కాంతారా చిత్రానికి ఫిదా అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంతారా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'చిన్న చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని కాంతారా చిత్రం నిరూపించింది. భారీ బడ్జెట్ లో తెరకెక్కే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ చిన్న చిత్రంగా వచ్చిన కాంతారా బాక్సాఫీస్ వద్ద  అంతా ఆశ్చర్యపోయే మ్యాజిక్ చేసింది. 

46
kantara

సినిమా బడ్జెట్, మేకింగ్ భారీగా ఉండాలనుకునే నా లాంటి వాళ్ళని కాంతారా చిత్రం ఇరుకున పెట్టింది. నన్ను నేను ప్రశ్నించుకునేలా, సమీక్షించుకునేలా చేసింది. ఇకపై నా లాంటి వాళ్ళు సినిమాలు ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు చెక్ చేసుకోవాలని కాంతారా చిత్రం తెలిపింది అంటూ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

56

రాజమౌళినే పునరాలోచనలో పడేసింది అంటే కాంతారా ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు మాట్లాడుతూ.. ఒకవేళ కాంతారా చిత్రం నిరాశపరిచి ఉంటే ఆ చిత్రం గురించి ఎవరికీ తెలిసి ఉండేది కూడా కాదు. మ్యాజిక్ వర్కౌట్ అయింది కాబట్టే ఇంత గొప్పగా ఉందని వర్మ అన్నారు. 

66

భారత సినిమా చరిత్రలోనే కాంతారా లాంటి అద్భుతం ఎప్పుడూ జరగలేదు. 15 కోట్లతో తెరకెక్కిన చిత్రం 350 కోట్ల వరకు రాబట్టడం చరిత్రలో ఇదే తొలిసారి. రిషబ్ శెట్టి దర్శకత్వానికి, నటనకి సెలెబ్రిటీలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

click me!

Recommended Stories