గుణశేఖర్ కుమార్తె నీలిమ వెడ్డింగ్ రిసెప్షన్.. స్టార్ సెలెబ్రిటీల సందడి చూశారా, ఫొటోస్ వైరల్

First Published Dec 12, 2022, 7:07 AM IST

నీలిమ భర్త వరుడి పేరు రవి ప్రఖ్యా. ఇటీవల ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. కాగా ఆదివారం రోజు సెలెబ్రిటీల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం'. క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పౌరాణిక గాధతో విజువల్ వండర్ గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

దుశ్యంతుడు, శకుంతల రమణీయ ప్రేమ గాధని గుణశేఖర్ తన విజన్ తో చూపించబోతున్నారు. శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించినట్లు టాక్. 

ఈ చిత్రాన్ని గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ నిర్మాణంలో సమంత చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా నీలిమ గుణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల, సినీ తారల సందడితో నీలిమ గుణ వివాహం, రిసెప్షన్ ఘనంగా జరిగాయి. తాజాగా రిసెప్షన్ నిర్వహించగా సినీలోకం మొత్తం తరలివచ్చింది. 

నీలిమ భర్త వరుడి పేరు రవి ప్రఖ్యా. ఇటీవల ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. కాగా ఆదివారం రోజు సెలెబ్రిటీల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ వేడుకకి టాలీవుడ్ నుంచి అతిరథమహారధులు, స్టార్ హీరోలు హాజరయ్యారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రాఘవేంద్ర రావు, రాజశేఖర్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, దగ్గుబాటి పురందేశ్వరి లాంటి ప్రముఖులంతా హాజరై వధూవరులని విష్ చేస్తూ ఆశీర్వదించారు. 

నీలిమ బ్లూ లెహంగాలో మెరిసిపోతుండగా, రవి సూట్ ధరించి స్టైలిష్ గా  కనిపిస్తున్నారు. వధూవరులు ఇద్దరూ ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. గుణశేఖర్ దంపతులు వచ్చిన అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. 

టి సుబ్బిరామిరెడ్డి, పురందేశ్వరి లాంటి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు కుటుంబ సమేతంగా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు బెల్లంకొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ లతో వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. 

ఇక గుణశేఖర్.. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి లాంటి హిట్ చిత్రాలని తెరకెక్కించారు. భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. 

ఇటీవల కాలంలో రుద్రమదేవి మినహా గుణశేఖర్ కి చెప్పుకోదగ్గ చిత్రం లేదు. అందుకే తనని తాను నిరూపించుకునేందుకు సమంతతో 'శాకుంతలం ' చిత్రాన్ని పౌరాణిక చిత్రంగా తీర్చి దిద్దుతున్నారు. 

తండ్రికి తోడుగా ఉంటూ నీలిమ నిర్మాణం విషయంలో సహకారం అందిస్తోంది. నీలిమ వివాహానికి, రిసెప్షన్ కి సమంత హాజరుకాకపోవడం ఆసక్తిగా మారింది. అయితే సమంత ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. బహుశా అందుకే హాజరు కాలేదేమో. 

మొత్తంగా గుణశేఖర్ తన పెద్ద కుమార్తె నీలిమ వివాహ వేడుకని వైభవంగా జరిపించారు. ఇక ఆయన శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ పై ద్రుష్టి పెట్టనున్నారు. 

నీలిమ గుణ తన తండ్రి తెరకెక్కించే చిత్రాలకు నిర్మాతగా కొనసాగాలని భావిస్తున్నారు. అవకాశం ఉంటే ఇతర చిత్రాలు నిర్మించాలని కూడా చూస్తున్నారు. 

click me!