బాహుబలిని మించిన సినిమా ఆర్ఆర్ఆర్... ఇంటర్వెల్ ఎపిసోడ్ 60 రాత్రులు షూట్ చేశాం- రాజమౌళి

Published : Mar 15, 2022, 01:47 PM IST

మరో పది రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

PREV
16
బాహుబలిని మించిన సినిమా ఆర్ఆర్ఆర్... ఇంటర్వెల్ ఎపిసోడ్ 60 రాత్రులు షూట్ చేశాం- రాజమౌళి

మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్(NTR), చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా ఉక్రెయిన్ క్రైసిస్ పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దేశంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ నాటు నాటు సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజల సప్పోర్ట్, ఆదరించిన తీరు గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

26

అక్కడి డాన్సర్స్, టెక్నికల్ టీమ్ సహకారం అద్భుతం అన్నారు. ఇతర దేశాల వారిని ప్రేమించి, ఆదరించే ప్రజలున్న ఉక్రెయిన్ దేశం యుద్ధ సంక్షోభంలో (Ukraine Crisis) చిక్కుకోవడం బాధాకరం అన్నారు. వేల మంది అమాయక ప్రజలు మరణిస్తుండగా.. అక్కడ వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడాలని కోరుకున్నారు. 
 

36

ఆర్ ఆర్ ఆర్ మూవీ బాహుబలి(Bahubali)ని మించిన చిత్రం అవుతుందని రాజమౌళి చెప్పడం అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. అన్ని విధాలుగా ఆర్ ఆర్ ఆర్ బాహుబలికి మించి చిత్రం అవుతుందని ఆయన తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందన్న చిత్ర యూనిట్ ఏకంగా 60 రాత్రుల పాటు చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. 
 

46

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram charan)ఇమేజ్, స్టార్డం, వాళ్ళ మార్కెట్ ఆధారంగా ఈ చిత్ర హీరోలుగా ఎంచుకున్నట్లు తెలియజేశారు. వాళ్ళ మధ్య ఉన్న స్నేహం కూడా ఒక కారణం అన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ సమయంలో తమ స్నేహం మరింత బలపడిందని, ఎన్టీఆర్, చరణ్ తెలియజేశారు. నటన, డాన్స్ పరంగా ఎన్టీఆర్ ని  చూసి కొత్త విషయాలు నేర్చుకున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఇక చరణ్ నాకు దొరికిన గొప్ప మిత్రుడని ఎన్టీఆర్ కొనియాడారు.  
 

56

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుండగా రాజమౌళి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో సీన్స్, డైలాగ్స్ ఎవరికి ఎంత ఉండాలనే కొలతలు ఫాలో కాలేదు అన్నారు. కథలో పాత్రకు అనుగుణంగా ఎన్టీఆర్, చరణ్ పాత్రలు తీర్చిద్దామన్నారు. అలాగే కథలో ఎమోషన్స్ సినిమా మొత్తం క్యారీ అయ్యేలా తెరకెక్కించినట్లు వెల్లడించారు. 
 

66


 కరోనా పరిస్థితులు అందరి మాదిరే బాగా ఇబ్బంది పెట్టాయని రాజమౌళి (Rajamouli) తెలియజేశారు. సాధారణ పరిస్థితులలో షూటింగ్ జరిగి ఉంటే మరింత గొప్పగా సినిమాను తీర్చిదిద్దేవాళ్ళం అన్నారు.  ఇక సెట్స్ లో ఎన్టీఆర్, చరణ్ అల్లరి రోజూ ఉండేదని. ఎంత కష్టంగా ఉన్నా షూటింగ్ ని ఎంజాయ్ చేశామన్నారు. మొత్తంగా నేటి ఆర్ ఆర్ ఆర్ టీం ప్రెస్ మీట్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని అర్థమవుతుంది.
 

click me!

Recommended Stories