ఆ భాషలో రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీనితో జక్కన్నకి ఓ స్టార్ హీరో ధైర్యం ఇచ్చారు. ఆ భాషలో రాజమౌళికి దక్కిన తొలి విజయం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో తిరుగులేని ఫిలిం మేకర్ గా ఎదిగారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళికి పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ ని సైతం కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది.
25
అక్కడ రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్
రాజమౌళికి ఇంతవరకు పరాజయమే లేదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి. రాజమౌళి సినిమాలని పలు భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ రాజమౌళి సినిమాలు ఒక దశ వరకు తమిళంలో అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
35
రవితేజ ఫోటో స్టార్ హీరో ఫోన్ లో..
తమిళ నటుడు కార్తీ నటించిన సినిమా ఈవెంట్ కి గతంలో రాజమౌళి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ..ఇండియన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా తీర్చి దిద్దే దర్శకుడు రాజమౌళి అని ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సినిమాల్లో ఉండే సినిమాటిక్ మూమెంట్స్ ని ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటారు అని కార్తీ తెలిపారు. విక్రమార్కుడు రీమేక్ చేయడం కోసం రెండేళ్ల పాటు రవితేజ ఫోటోని తన ఫోన్ లో పెట్టుకుని తిరిగినట్లు కార్తీ తెలిపారు.
విక్రమార్కుడు రీమేక్ సిరుతై చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని కార్తీ అన్నారు. రాజమౌళి మైక్ తీసుకుని ఈ సందర్భంగా నేను కార్తీకి కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నారు. ఎందుకంటే నా సినిమాలు ఒక్కటి కూడా తమిళంలో సరిగ్గా ఆడలేదు. కానీ కార్తీ చేసిన విక్రమార్కుడు రీమేక్ సిరుతై మాత్రం సూపర్ హిట్ అయింది. దీనితో నా సినిమాలు కూడా తమిళంలో ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకు కార్తీకి కృతజ్ఞతలు అని రాజమౌళి అన్నారు.
55
తెలుగులో కార్తీ క్రేజ్
బాహుబలి నుంచి రాజమౌళి సినిమాలకు పాన్ ఇండియా గుర్తింపు లభించింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఇండియా సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ లో చేరాయి. ఇక కార్తీ ఆవారా, ఖైదీ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.