Mahesh-Balayya Multi starrer: సరికొత్త సంచలనాలకు తెరలేపిన రాజమౌళి.. సంబరాల్లో మహేష్‌, బాలయ్య ఫ్యాన్స్ ?

Published : Feb 19, 2022, 11:15 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా సంచలనమే. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌, నందమూరి నట సింహాం బాలయ్యతో కలిసి మరో సంచలనానికి తెరలేపుతున్నారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

PREV
17
Mahesh-Balayya Multi starrer: సరికొత్త సంచలనాలకు తెరలేపిన రాజమౌళి.. సంబరాల్లో మహేష్‌, బాలయ్య ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు(Mahesh) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ భారీ సినిమాని ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట`, అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమా ఉండబోతుంది. దీనికి సంబంధించిన కథ సిద్ధమవుతుంది. ఇటీవలే ఈ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. 

27

మరోవైపు మహేష్‌తో ఓ అడ్వెంచరస్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారనే వార్త కూడా చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది. మహేష్‌ సాహసికుడిగా కనిపించబోతున్నారని, ఆయన పాత్ర స్టయిలీష్‌గానూ, అదే సమయంలో కౌబాయ్‌ తరహాలోనూ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మహేష్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. 

37

ఇదిలా ఉంటే ఇందులో ఓ కీలక పాత్ర ఉందని తెలుస్తుంది. మహేష్‌ చిత్రాన్ని రాజమౌళి మల్టీస్టారర్‌గా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో మహేష్‌తోపాటు ఉన్న ముఖ్యమైన పాత్ర కోసం ఓ స్టార్‌ హీరోయిన్‌ తీసుకోవాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నారట. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ఆ స్థాయి ఇమేజ్‌ ఉన్న హీరోని తీసుకోవాలని ప్రస్తుతం ఆ నటుడి కోసం అన్వేషణ చేస్తున్నారని అంటున్నారు. 

47

అయితే ఆ నటుడి ఎవరు అని ఆరా తీసే పనిలో ఫ్యాన్స్‌ బిజీగా ఉన్న నేపథ్యంలో ఓ సంచలన హీరో పేరు బయటకు వచ్చింది. రాజమౌళి.. ఆ పాత్ర కోసం బాలకృష్ణ(Balakrishna)ని అనుకుంటున్నారనే గూస్‌బంమ్స్ తెప్పించే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇటీవల బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌` షోకి రాజమౌళి వెళ్లగా నాతో సినిమా ఎప్పుడు చేస్తావని బాలయ్య అడిగారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్‌ సినిమాలో కీలక పాత్ర కోసం బాలయ్యని తీసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి. 

57

దాదాపు ఈ పాత్ర  నిడివి 40 నిమిషాలు ఉంటుందని, ఆ పాత్రసినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుపోతుందని, బాలయ్య అయితే యాప్ట్ అవుతారని, ఆయన నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడమే కాదు, సినిమా రేంజ్‌ని కూడా పెంచేస్తారని భావించిన జక్కన్న ఈ మాస్టర్‌ ప్లాన్‌ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. Mahesh rajamouli Multi starrer.

67

అదే సమయంలో ఇటీవల బాలయ్య షోకి మహేష్‌కి కూడా వెళ్లారు. ఈ సందర్బంగా వీరిద్దరు సరదాగా అనేక విషయాలను చర్చించుకున్నారు. బాలయ్యని మహేష్‌, మహేష్‌ని బాలయ్య ఆటపట్టించారు. వీరిద్దరి మధ్య ర్యాపో బాగా బిల్డ్ అయ్యింది. అదే సినిమాలోనూ వర్క్ అవుతుందని రాజమౌళి అనుకుంటున్నారట. అయితే సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో సీన్లు ఉండవనే వార్త ఇద్దరు హీరోల అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది. 

77

కానీ ఇద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్తతో అటు మహేష్‌, ఇటు బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  జక్కన్న తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సంచలనాలు క్రియేట్‌ చేయగలరు. అలా మహేష్‌-బాలయ్య కాంబినేషన్‌లో మరో సంచలనానికి తెరలేపబోతున్నారని చెప్పొచ్చు. ఇందులో నిజమెంతో గానీ ఇది అందరిని ఎంటర్‌టైన్‌ చేసే వార్తగా నిలవడం విశేషం. Mahesh Balakrishna Multistarrer

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories