రాఘవ్ కన్నా దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్టును సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘నేనొక అద్భుతమైన కథ చెప్పాలనుకుంటున్నాను’ అంటూ మొదలైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు రాజమౌళిపై వారికున్న అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.