దఢక్ హీరో ఇషాన్ కట్టర్ తో జాన్వీ కపూర్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. అక్షత్ రాజన్, ఆర్యన్ కార్తీక్ తో కూడా జాన్వీ కపూర్ డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. నటిగా కంటే కూడా ఎఫైర్ రూమర్స్ తో జాన్వీ కపూర్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి ఆరేళ్ళు దాటిపోయింది. ఆమెకు ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు. చెప్పాలంటే స్టార్ హీరోతో మూవీ చేయలేదు.