Nayanatara: రహస్య వివాహం చేసుకున్న నయనతార... ఆ వీడియో లీక్ కావడంతో పిక్చర్ క్లియర్

Published : Mar 12, 2022, 05:08 PM IST

నయనతార హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయ్యిందో.. లవ్ అఫైర్స్ తో ఆమె అంతకు మించి ఫేమస్ అయ్యారు.తాజాగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఐదేళ్లకు పైగా డేటింగ్ చేస్తున్న నయనతార రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

PREV
16
Nayanatara: రహస్య వివాహం చేసుకున్న నయనతార... ఆ వీడియో లీక్ కావడంతో పిక్చర్ క్లియర్

దర్శకుడు విగ్నేష్ శివన్-నయనతార (Nayantara)కోలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది హాట్ టాపిక్. గత రెండేళ్లుగా వీరి పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేపు పెళ్లంటూ మాపు పెళ్లంటూ కథనాలు వెలువడుతున్నాయి.

26

అయితే ఈ వార్తలను నయనతార, విగ్నేష్ శివన్(Vignesh Shivan) ఖండిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నామని, సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. కాగా వీరికి ఆల్రెడీ వివాహం జరిగిందని  అనుమానాలున్నాయి. ఈ అనుమానాలకు తాజా వీడియో బలం చేకూర్చుతుంది. 
 

36

ఇటీవల తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని విగ్నేష్ శివన్, నయనతార సందర్శించారు. అక్కడ నయనతారను చూసిన సాధారణ భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. అదే సమయంలో ఆమె వీడియోలు కూడా తీశారు. సదరు వీడియోలో నయనతార పాపిట కుంకుమ పెట్టుకొని కొనిపించారు. భారతీయ సాంప్రదాయంలో పెళ్ళైన స్రీలు మాత్రమే పాపిట కుంకుమ పెట్టుకుంటారు. 
 

46

ఈ క్రమంలో విగ్నేష్, నయనతార హడావుడి లేకుండా రహస్యంగా వివాహం చేసుకొని ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. వారిద్దరి ప్రవర్తన కూడా అలానే ఉంది. పేరుకే ప్రేమికులు కానీ భార్యాభర్తలకు మించి సన్నిహితంగా ఉంటున్నారు. ప్రేమికుల రోజు అర్ధరాత్రి విగ్నేష్ ఇంటిని సందర్శించిన నయనతార పూలగుచ్ఛం తో ఆయనకు విషెస్ తెలియజేశారు.

56


మరి ఈ ఉహాగానాలలో ఎంతవరకు నిజం ఉందో కాలమే తేల్చాలి. కాగా కెరీర్ బిగినింగ్ లో నయనతార హీరో శింబును ప్రేమించారు. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. శింబు, నయనతార ప్రైవేట్ ఫోటోలు కూడా బయటికి రాగా... వీరి ఎఫైర్ అప్పట్లో సంచలనమైంది. 

66

అనంతరం నయనతార స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను ప్రేమించారు. నయనతార ప్రేమ కోసం ప్రభుదేవా భార్యకు విడాకులిచ్చాడు. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా బ్రేకప్ చెప్పుకున్నారు. ముచ్చటగా మూడోసారి విగ్నేష్ శివన్ ని ప్రియుడిగా తెచ్చుకుంది నయనతార. ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి చేసుకోకపోవడంతో గత లవ్ స్టోరీల మాదిరి ఇది కూడా మధ్యలో ముగుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నారు. 
 

click me!

Recommended Stories