చరణ్ విషయంలో రాజమౌళి ఫుల్ కాన్ఫిడెంట్.. కానీ చిరంజీవి అంతలా ఎందుకు భయపడ్డారో తెలుసా ?

First Published Jul 8, 2024, 4:53 PM IST

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాంచరణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. రాంచరణ్ చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాంచరణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. రాంచరణ్ చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరుత మూవీ సాఫీగా రిలీజై విజయం సాధించింది. డ్యాన్సులు, ఫైట్స్ రాంచరణ్ అదరగొట్టేశాడు అని అంతా ప్రశంసించారు. 

ఆ తర్వాత రాంచరణ్ కి అగ్ని పరీక్ష మొదలయింది. తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో రాజమౌళి చాలా పెద్ద కసరత్తు చేశారు. అయితే రాంచరణ్ తో మగధీర చిత్రం చేయడం ఏమైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి రాజమౌళి సమాధానం ఇచ్చాడు. 

Latest Videos


ఎలాంటి ఛాలెంజ్ లేదు. చిరుత చిత్రం చూసిన తర్వాత రాంచరణ్ పెద్ద సినిమాలని హ్యాండిల్ చేయగలడు అని అనిపించింది. సీరియస్ రోల్స్ కి చరణ్ బాగా సెట్ అవుతాడు. దీనితో మగధీర కథ పూర్తి కాకముందు 100 మందితో ఫైట్ సీన్ నా మైండ్ లో ఉంది. చిరంజీవివి గారికి ఇలా అనుకుంటున్నాను అని చెప్పాను. ఒకే అని కథ డెవలప్ చేయమన్నారు. 

కథ మొత్తం పూర్తయ్యాక చిరంజీవిగారికి విపరీతంగా నచ్చేసింది. కానీ ఇది చరణ్ కి రెండవ సినిమానే. ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయగలడా అని చిరంజీవి గారు టెన్షన్ పడ్డారు. కానీ నాకు మాత్రం చరణ్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. చిరుతలో కొన్ని సీన్స్ లో రాంచరణ్ చూపించిన ఎక్స్ ప్రెషన్స్ చాలా బావుంటాయి. 

షూటింగ్ లో కూడా చరణ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. కానీ నేను మాత్రం కాజల్, చరణ్ మధ్య లవ్ సీన్స్ చేసేసమయంలో కథ ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అప్పటికి పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ లో నాకు అనుభవం ఉంది కానీ.. లవ్ సీన్స్ లో నాకు అనుభవం లేదు. కాబట్టి చరణ్, కాజల్ ని మరొక టేక్ అని అడిగేవాడిని అని రాజమౌళి అన్నారు. 

ram charan chiranjeevi

మగధీర విడుదలయ్యాక అప్పటికి టాలీవుడ్ రికార్డులని తిరగరాస్తూ అద్భుతమైన విజయం సాధించింది.చరణ్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలోఆర్ ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుని కూడా కొల్లగొట్టింది. 

click me!