దర్శకధీరుడు రాజమౌళి శక్తిసామర్థ్యాలు గురించి అనుమానం అవసరం లేదు. రాజమౌళి టేకప్ చేశారంటే ఎంతటి పెద్ద ప్రాజెక్ట్ అయినా దిగ్విజయంగా పూర్తి చేసి తీరుతారు. ప్రస్తుతం జక్కన్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతోంది.
దీనితో Rajamouli తన స్టైల్ లో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. నవంబర్ 1న RRR టీజర్ విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఆదివారం రాజమౌళి వైజాగ్ జెమ్స్ కాలేజీ ఫెస్ట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి విద్యార్థులతో ముచ్చటించారు. పలు విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా రాజమౌళి ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Pawan Kalyan, రాజమౌళి కాంబినేషన్ గురించి చాలా కాలంగా అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. గతంలో పలు సందర్భంగా పవన్ తో సినిమా గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆయనతో సినిమాచేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన మైండ్ సెట్, నా మైండ్ సెట్ వేరని ఆ మధ్యన తెలిపారు.
తాజాగా దీనిపై రాజమౌళి జెమ్స్ కాలేజీలో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను కూడా చాలా ఏళ్ళు ఎదురుచూశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్ గా కూడా అనిపించింది. మీరు ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారు అని అడిగాను. ఎలాంటి చిత్రం అయినా పర్వాలేదు నేను చేస్తాను అని అన్నారు.
మీరు టైం ఇవ్వండి నేను కథ చెబుతా అని చెప్పా. చాలా రోజులు ఎదురుచూశా.. ఆయన నుంచి పిలుపు రాలేదు. ఈ లోపు పవన్ గారు ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. నా ఆలోచన కూడా మారిపోయింది. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు.. పెద్ద సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యా. ఇంతలో ఆయన పాలిటిక్స్ లోకి కూడా వెళ్లారు. అలా మా ఇద్దరి దారులు వేరయ్యాయి. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారిపై గౌరవం ఎప్పటికీ ఉంటుందని రాజమౌళి అన్నారు.
రాజమౌళి, పవన్ కాంబినేషన్ అంటే వెండితెరపై డెడ్లీ కాంబో అవుతుంది. కారణాలు ఏవైనా ఈ మొత్తం ఎపిసోడ్ లో తప్పు పవన్ వైపే ఉందని చెప్పొచ్చు. లేకుంటే బాక్సాఫీస్ బద్దలయ్యే కాంబినేషన్ ని అభిమానులు చూసి ఉంటారు.
ఇక రాజమౌళి ప్రభాస్ గురించి కూడా అదిరిపోయే కామెంట్ చేశారు. మహాభారతంలో తనకు కర్ణుడి పాత్ర చాలా ఇష్టం అని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మినదానికోసం కర్ణుడు నిలబడ్డాడని అన్నారు. సినిమాలో కర్ణుడి పాత్ర కోసం ఏ హీరోని ఎంచుకుంటారు అని విద్యార్థులు ప్రశ్నించగా.. రాజమౌళి తడుముకోకుండా Prabhas పేరు చెప్పారు. మహాభారతం తీయాలనేది రాజమౌళి కల. మహాభారతంలో కర్ణుడి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.