తండ్రి మరణవార్తని పునీత్ కుమార్తెలు దృతి, వందిత జీర్ణించుకోలేకున్నారు. వారిద్దరిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. ఇద్దరు కుమార్తెలు తండ్రి కోసం గుండెలు పగిలేలా రోదిస్తుండడం అందరిని కలచివేస్తోంది. పునీత్ తో అనుబంధం ఉన్న తెలుగు స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్ లు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. శనివారం వీరంతా బెంగళూరుకు వెళ్లి పునీత్ కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.