RRR movie: హార్ట్ ఆఫ్ ది ఆర్ ఆర్ ఆర్... జనని సాంగ్ చూడండి, సినిమా ఏమిటో తెలిసిపోతుంది... రాజమౌళి కామెంట్స్!

First Published | Nov 25, 2021, 1:16 PM IST

ఆర్ ఆర్ ఆర్ నుండి సెకండ్ సింగిల్ 'జనని' రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు జనని సాంగ్ ని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దానయ్యతో పాటు రాజమౌళి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి (Rajamouli)సాంగ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో లెక్కకు మించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు హై అడ్రినలిన్ సీన్స్ ఉంటాయి. ప్రతి సన్నివేశానికి హార్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ మోషన్ ప్రతి సన్నివేశం తో పాటు అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది.

Naatu song

చివరికి నాటు నాటు (Naatu naatu) లాంటి ఒక మాస్ బీట్ సాంగ్ లో కూడా నిగూఢంగా ఓ ఎమోషన్ గుండెల్లో క్యారీ అవుతుంది. ఈ అన్నీ ఎమోషన్స్ లోతుల్లోకి వెళ్లి తరచి తరచి చూస్తే, అక్కడ ఇంకా సాఫ్ట్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. 

Latest Videos


కంటికి కనపడని ఆ సాఫ్ట్ ఎమోషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోని యాక్షన్, ఎమోషనల్, ఉత్కంఠ రేపే అన్ని సన్నివేశాలను పట్టి ఉంచుతుంది. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా సోల్ మనకు చెప్పేదే  ఈ జనని సాంగ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా సోల్ కి సంగీతం రూపం ఇస్తే జనని సాంగ్. ఈ సాంగ్ ఒక సాఫ్ట్ మెలోడీ, మూవీ యొక్క మొత్తం సోల్ ఈ సాంగ్. ఒకరకంగా  చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ హార్ట్. 

రెండు నెలలు రీ రికార్డింగ్ చేసిన తర్వాత మూవీ యొక్క కోర్ మెలోడీ పట్టుకోవాలని కష్టపడి..కీరవాణి జనని సాంగ్  ట్యూన్ చేశారు. జనని ఆర్ ఆర్ ఆర్ మూవీ కోర్ మెలోడీ అని చెప్పాలి. తెలుగులో లిరిక్స్ కూడా రాశారు. కేవలం సాంగ్ చూడండి, ఫీల్ అవ్వండి...  అంటూ రాజమౌళి మూవీ మొత్తానికి, జనని సాంగ్ ప్రాధాన్యత ఏమిటో తెలిపారు.

ఇక రాజమౌళి జనని సాంగ్ (Janani song)కి ఇచ్చిన వివరణ చూస్తే... ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఈ సాంగ్ ద్వారా ప్రేక్షకుడికి కలిగే అవకాశం కలదు. ఈ సమావేశంలో తనని ఎటువంటి ప్రశ్నలు అడగవద్దని రాజమౌళి మీడియాను కోరారు. జస్ట్ ఇది జనని సాంగ్ గురించి, ఆ టాపిక్ డైవర్ట్ కాకూడదు. త్వరలో కంప్లీట్ ఆర్ ఆర్ ఆర్ (RRR movie)టీం తో మీ ముందుకు వస్తాం.. అప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం అన్నారు.


అలాగే  వచ్చే నెలలో ట్రైలర్ విడుదలతో పాటు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. ఇది ప్రమోషనల్ ఈవెంట్ కాదని, అది వేరేగా ఉంటుంది అంటూ రాజమౌళి తెలియజేశారు. జనని సాంగ్ పై రాజమౌళి వ్యాఖ్యల నేపథ్యంలో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. 

Also read ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్.. అఖండ నుంచి పెద్ద చిత్రాలే, నిర్మాతల ప్లాన్ ?

Also read ఆర్.ఆర్. ఆర్, పుష్ప ...దుబాయి ఈవెంట్స్ కాన్సిల్, కారణం

click me!