సావిత్రి, సూర్యకాంతం తర్వాత రాజమౌళికి బాగా నచ్చిన నటి..అనుష్క కాదు, ఆమె పేరు చెబుతాడని కలలో కూడా ఊహించరు

First Published | Nov 10, 2024, 6:26 PM IST

దర్శకధీరుడు రాజమోళికి నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ఎంత బాగా రాబట్టుకోవాలో తెలుసు. రాజమౌళి సినిమా అంటే దాదాపుగా అందరు నటులు అద్భుతంగా నటిస్తారు. రాజమౌళి తాను అనుకున్న ఎక్స్ ప్రెషన్ వచ్చేవరకు వదిలిపెట్టరు.

దర్శకధీరుడు రాజమోళికి నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ఎంత బాగా రాబట్టుకోవాలో తెలుసు. రాజమౌళి సినిమా అంటే దాదాపుగా అందరు నటులు అద్భుతంగా నటిస్తారు. రాజమౌళి తాను అనుకున్న ఎక్స్ ప్రెషన్ వచ్చేవరకు వదిలిపెట్టరు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతోనే రాజమౌళి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించే కథలతోనే సినిమాలు చేస్తుంటారు. 

విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి డైరెక్టర్ కాకముందే ప్రముఖ రచయితగా కథలు అందించారు. ఇక విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. రాజమోళి తనకి నచ్చిన నటీనటుల గురించి తరచుగా కామెంట్స్ చేస్తుంటారు. ఎంతో నేచురల్ గా నటించే నటీనటులంటే రాజమౌళికి ఇష్టం అట. అలా సహజంగా నటించే నటీమణుల్లో రాజమౌళికి ఇష్టమైన వారు మహానటి సావిత్రి, దిగ్గజ నటి సూర్యకాంతం. 


వీరి తర్వాత రాజమౌళిని అంతలా మెప్పించిన నటి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ నటి ఎవరో కనీసం కలలో కూడా ఊహించలేం. సావిత్రి, సూర్యకాంతం తర్వాత రాజమౌళిని మెప్పించిన నటి రాజన్న చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ అనీ అట. ఆ చిన్నారి నటనకి తాను ఫిదా అయినట్లు రాజమౌళి తెలిపారు. ఎంతో నేచురల్ గా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతం అని జక్కన్న ప్రశంసించారు. 

రాజన్న చిత్రం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. కమర్షియల్ గా ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఓ సన్నివేశం చాలా లెన్త్ ఉంటుంది. అంత లెన్తీ సీన్ లో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు. కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి తెలిపారు. ఆ అమ్మాయి అంత బాగా నటిస్తుంటే మీరు జలసీ ఫీల్ అయ్యారా అని రాజమౌళి నాగార్జునని ప్రశ్నించారు. 

నాగార్జున ఫన్నీగా సమాధానం ఇచ్చారు. అనీ నాకు సమానమైన వయసు ఉండి  ఉంటే తప్పకుండా జలసీ ఫీల్ అయ్యేవాడిని అని అన్నారు. రాజన్న చిత్రం రిలీజ్ అయ్యే సమయానికి అనీ వయసు 10 ఏళ్ళు. అసలు అంత చిన్న వయసులో కథని ఎలా అర్థం చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. ఆమె నటిస్తుంటే నాకు షాకింగ్ గా అనిపించి అనీ నీ వారు 10 ఏళ్లేనా అని మరోసారి అడిగినట్లు నాగార్జున ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అనీ పెద్ద అమ్మాయి అయింది. ఆమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2011లో రాజన్న చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!