ఎన్టీ రామారావు నటుడిగా, హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని స్టార్ స్టేటస్‌ని అనుభవించాడు. రాజకీయంగానూ ఆయన సీఎం అయ్యాడు. సక్సెస్‌ఫుల్ సీఎంగానూ పేరుతెచ్చుకున్నారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన పీక్ స్టేజ్‌ని చూశారు. రాజసం అనుభవించాడు. ఆ తర్వాత పరాభవాలు చవిచూశాడు. రాజకీయ కుట్రలో బలి కూడా అయ్యాడు. చివరికి చాలా దారుణ స్థితిలో, అయిన వాళ్లే దూరం పట్టించుకోని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు కన్నుమూసినట్టు చెబుతుంటారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్టీఆర్ జీవితం లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాతే మారిపోయింది. వైభవంగా ఉండాల్సిన ఆయన లైఫ్ డౌన్ అయ్యిందని అంతా చెబుతుంటారు. చంద్రబాబు రాజకీయ కుట్రలకు బలయ్యాడని మరికొందరు చెబుతుంటారు. ఏదేమైనా చివరి రోజుల్లో మాత్రం ఎన్టీఆర్ చాలా డౌన్ అయిపోయాడు.
అయితే అలాంటి సమయంలోనూ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి ఎంతో ప్రయారిటీ ఇచ్చాడట. ఫ్యామిలీ కోసం లక్ష్మీ పార్వతిని కూడా ఎదురించారట. ఆ కోణాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన లక్ష్మయ్య షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లొద్దని లక్ష్మీ పార్వతి అడ్డుకుందని తెలిపారు. మరి ఏం జరిగిందంటే..
హరికృష్ణకి జానకీరామ్, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్‌తోపాటు కూతురు సుహాసిని కూడా ఉంది. ఆ టైమ్‌లో సుహాసిని పెళ్లి. ఎన్టీఆర్‌ని పెళ్లికి తీసుకురావాలి. ఆ బాధ్యత డ్రైవర్ లక్ష్మణ్‌కి అప్పగించాడు హరికృష్ణ. అయితే ఎన్టీఆర్ కూడా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఓ రకమైన కోపంతో ఉన్నాడు. దీంతో ముందు తీసుకురావద్దని, కరెక్ట్ గా మార్నింగ్ 7 గంటలకు తీసుకురావాలని తెలిపాడట హరికృష్ణ.
డ్రైవర్ లక్ష్మణ్ ఆ ప్లాన్ ప్రకారమే చేశాడట. అయితే ఇంట్లో లక్ష్మీ పార్వతి అడ్డుకుందట. డోర్‌కి అడ్డుగా కూర్చుందట. వెళ్లొద్దని ఒత్తిడి చేస్తుందట. కోపం వచ్చిన ఎన్టీ రామారావు కోపంతో ఆమె చైర్ పక్కకి నెట్టేశాడట. దీంతో అంత దూరంలో పడిపోయిందట. ఆమె వైపు కూడా చూడకుండా కారు తీసుకుని వెళ్లిపోయారు. కరెక్ట్ గా ఏడుగంటలకు హరికృష్ణ ఇంటికి వెళ్లాడు. రామారావు రాకని గ్రాండ్‌గా ప్లాన్ చేశారట ఫ్యామిలీ మెంబర్స్. ఓ వైపు మనవళ్లు, మనవరాళ్లు, మరోవైపు కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు ఉండి పూలు జల్లుతూ ఆహ్వానించారట. దీంతో ఇంటికి వెళ్లేసరికి అంతా కూల్ అయిపోయాడట.
మరో మాట లేకుండా, మనవరాలు సుహాసినిని ఆశీర్వదించారట ఎన్టీఆర్. అంతేకాదు వెంటనే టిఫిన్ కూడా చేయించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లారట. అక్కడ అర్థగంటకుపైగానే ఉన్నాడని తెలిపారు డ్రైవర్ లక్ష్మయ్య. ఇందులో హరికృష్ణ కూతురు పెళ్లిని లక్ష్మీ పార్వతి అడ్డుకుందనే విషయాన్ని లక్ష్మయ్య బయటపెట్టడం షాకిస్తుంది.
పెళ్లి పత్రిక ఇవ్వలేదనే విషయంలో లక్ష్మీ పార్వతికి కోపంగా ఉందని, అందుకే ఆ పెళ్లికి వెళ్లొద్దని రామారావుపై ఒత్తిడి తెచ్చిందన్నారు. కార్ లో వెళ్తున్నప్పుడు `మీ ఇంట్లో పెళ్లికి పత్రిక ఎవరు ఇస్తార`ని లక్ష్మణ్ ప్రశ్నించాడట. దీంతో ఆయనలో మార్పు వచ్చిందట. నెక్ట్స్ డే పెళ్లికి గంట ముందుగానే వెళ్లి అందరిని రిసీవ్ చేసుకున్నాడట ఎన్టీఆర్. అలా హ్యాపీగా పెళ్లి అయిపోయిందని, దగ్గరుండి ఎన్టీ రామారావు పెళ్లి చేశాడని తెలిపారు లక్ష్మణ్.
ఎన్టీఆర్ సినిమాల్లో పీక్‌లో ఉన్న సమయంలోనే 1982లో టీడీపీ పార్టీని పెళ్లి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఏడాదికి ఆయన సీఎం అయ్యారు. మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది. రాజకీయ కుట్రల కారణంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ సీఎం అయి 1989వరకు ఉన్నారు. 1989-94 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు.
మళ్లీ94లో సీఎం అయ్యారు. ఏడాదిపాటు సీఎంగా చేశాడు. ఇంతలో ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లిచేసుకోవడం, ప్రభత్వంలో, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆయన సీఎం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. పదవి పోవడంతో కుంగిపోయిన ఎన్టీఆర్ హర్ట్ ఎటాక్‌తో 1996లో కన్నుమూశారు.
read more: కలర్ తక్కువ అంటూ శోభన్‌బాబుని అవమానించిన జయలలిత తల్లి, ప్రతీకారంగా సోగ్గాడు ఏం చేశాడో తెలుసా?