రాజమౌళి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హిట్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ షేక్ అవ్వడం అంటే ఏంటో మరచిపోయాం. ఎందుకంటే సింహం కొంచెం రెస్ట్ తీసుకుంటోంది అంటూ బాలయ్యకి రాజమౌళి వీర లెవల్ లో ఎలివేషన్ ఇచ్చారు. జనవరి 11న ఆ సింహం జూలు విదిల్చబోతోంది. ఒక్కమగాడు చిత్ర ఫస్ట్ షో మీతో పాటు చూస్తా. మీకన్నా గట్టిగా అరుస్తా.. జై బాలయ్య అంటూ రాజమౌళి నరాలు తెగేలా బిగ్గరగా అరిచారు.