ఇండస్ట్రీలో ఘంటసాల లాంటి దిగ్గజాలు.. తుఫానులా దూసుకుపోతున్న రోజులవి.. ఆయనన్ను దాటి ఎవరు ముందుకు వచ్చి కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేదు. అంత సాహసం చేసేవారు కాదు. ఘంటసాల తరువాత ఏఎం రాజా, పిఠాపురం నాగేశ్వరరావు, పిబి శ్రీనివాస్ లాంటివారు గాయకులుగా ఉన్నారు. ఇంత పెద్ద సంగీత సామ్రాజ్యంలో ఘంటసాల అంటేనే.. సంగీత దర్శకులు ముందుకు వచ్చేవారు. అంత బలమైన గాలికి కూడా ఎదురెల్లి నిలుచున్నాడు బాలు. అలాంటి రోజుల్లో ఇండస్ట్రీ మెట్లెక్కిన బాలసుబ్రహ్మణ్యంకు.. మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం స్టార్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో పద్మనాభం.