Kalki
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి గురువారం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ సినిమాలో విశేషాలు గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో వచ్చిన గెస్ట్ రోల్స్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఈ చిత్రంలో కృష్ణుడిగా నటించిందెవరా? అనేది మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా మారింది.
అందుకు కారణం కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే . అయితే కొందరు ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించి.. హీరో నాని అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఇతర హీరోల పేర్లు చెప్పుకున్నారు. అయితే అవేమీ కాదు. అతనో తమిళ నటుడు. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా చెప్పుకొచ్చారు.
kalki
ఎవరు కృష్ణుడుగా చేసారనే డిస్కషన్ సంబంధిత పోస్ట్‌లపై.. స్వయంగా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో సమాధానం లభించినట్టైంది. ఆయనే తమిళ నటుడు కృష్ణ కుమార్ (కేకే) (Krishnakumar).కేకీ బాగా ఫిమిలియర్ కాదు కానీ. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’తో పలకరించారు. ఈ మూవీలో సూర్యకు స్నేహితుడిగా నటించారు కేకే.
అలాగే ధనుష్ ‘మారన్’లోనూ కీలక పాత్ర పోషించారు. ‘కాదళగి’తో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు ‘కల్కి’ ఐదో చిత్రం. ఇతను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. తానే ఈ రోల్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కూడా పెట్టాడు. అలాగే శ్రీకృష్ణుడి వాయిస్ ని చాలా తక్కువ మంది గుర్తుపట్టారు.
శ్రీకృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మరెవరో కాదు.. ట్యాలెంటెడ్ యాక్టర్ అర్జన్ దాస్. మంచి బేస్ వాయిస్ ఉన్న ఈ యాక్టర్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కల్కి మూవీలోని శ్రీకృష్ణుడి పాత్రకు అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి తనదైన వాయిస్ తో మరోసారి అర్జున్ దాస్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఈ విషయాన్ని నటుడు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. ఈ సినిమాలో అర్జున్ దాస్ అద్భుతమైన వాయిస్ ఓవర్ ఇచ్చాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహాభారతంలోని కొన్ని అంశాలను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని తెరకెక్కించారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది. సౌతిండియా, నార్తిండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ ఇదే రేంజ్లో ప్రీ సేల్స్‌ను జరుపుకుని భారీ వసూళ్లను అందుకుంది. దీంతో ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులతో బిజీ అయిపోయాయి థియేటర్లు.
మరో ప్రక్క కల్కి ఓపెనింగ్ డే కలక్షన్లు ప్రభాస్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ వసూలు చేసేలా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ.217 కోట్లను దాటేసే అవకాశం ఉంది. ఈ రికార్డును రాజమౌళి డైరక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ రూ.223 కోట్లతో ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'సలార్' ఆ రికార్డు బ్రేక్ చేయలేక రూ.178 కోట్లతోనే ఆగిపోయింది. ఇప్పుడు బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ సారి రికార్డులు బ్రేక్ అయిపోతాయంటున్నారు అభిమానులు. కల్కి 2898 AD ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ.200 కోట్లు దాటితే అది చరిత్ర సృష్టించినట్లే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం. కథలోని మూడు ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టి పడేస్తుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్‌తో సాగుతుంది.