Oscar2023: ఆస్కార్‌ వరకు వెళ్లాలంటే ఇంత కష్టపడలా? `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం వందల కోట్లు ధారపోసిన రాజమౌళి?

First Published Jan 24, 2023, 10:58 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. `నాటు నాటు` సాంగ్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. కానీ ఆస్కార్‌ వరకు వెళ్లడానికి పడ్డ కష్టం, పెట్టిన ఖర్చు షాకిస్తుంది. 

ప్రపంచ సినిమాల్లో అత్యున్నత పురస్కారంగా `ఆస్కార్‌`(Oscar) అవార్డుని భావిస్తారు. ఆస్కార్‌ వస్తే ఏ ఫిల్మ్ మేకర్‌కి అయినా, నటీనటులు, టెక్నీషియన్లకి అంతకు మించిన అనుభూతి, గౌరవం మరేది లేదంటారు. అందుకే ఆస్కార్‌ రావడమనేది ఆశామాషి విషయం కాదు. తాజాగా 2023కిగానూ `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) మూవీ `నాటు నాటు`(Naatu Naatu) పాటకిగానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ (Oscar Nomination) పొందింది. ఆస్కార్‌ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో ఉంది. 
 

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ ఆస్కార్‌ కమిటీ ఎంపిక చేయలేదు. `చెల్లో షో` అనే గుజరాతీ మూవీని ఎంపిక చేసింది. కానీ అది నామినేట్‌ కాలేదు. దీంతో ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ కి పోటీ పడే ఛాన్స్ ని `ఆర్‌ఆర్‌ఆర్‌` కోల్పోయింది. అయితే ప్రైవేట్‌గానూ ఆస్కార్ కి పోటీ పడొచ్చని నిరూపించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. అంతేకాదు ఏకంగా నామినేషన్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. మరి ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లాలంటే ఏం చేయాలి, ఆ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది, ఆస్కార్‌ నిబంధనలు ఎలా ఉంటాయి, అది ఎంత కష్టం, ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలుసుకుందాం. 
 

`ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు రాజమౌళి టీమ్‌ భారీగా ఖర్చు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు వంద కోట్లకుపైగా ఖర్చు చేశారని ఓ టాక్‌, 150కోట్లు ఖర్చు అయ్యిందని మరో టాక్‌ ఇటు ఫిల్మ్ నగర్‌లోనూ, అటు సోషల్‌ మీడియాలోనూ వినిపించింది. మరి అంత ఖర్చు ఎందుకు అవుతుందనేది చూస్తే, ఓ సినిమా ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ కావాలంటే కొన్ని ప్రాథమిక నిబంధనలున్నాయి. 
 

`జనరల్‌ కేటగిరిలో ఆస్కార్ కోసం పోటీ అవకాశం అమెరికాతోపాటు ఇతర దేశాల సినిమాలకు కూడా ఉంది. అయితే ఆ సినిమా 2022జనవరి 1 నుంచి, డిసెంబర్‌ 31 వరకు ఆ ఏడాదిలోపు థియేటర్లలో విడుదలై ఉండాలి. అమెరికాలో ఆస్కార్‌ కమిటీ నిర్ణయించిన ఆరు ఏరియాల్లో ఏడు రోజులపాటు ఒక్క థియేటర్లో ప్రదర్శించబడి ఉండాలి. సినిమా 40 నిమిషాల కంటే ఎక్కువ నిడివితో, 35ఎంఎం, 70ఎంఎం ఫార్మాట్‌లో తీసి ఉండాలి. సినిమాలో ఫారెన్‌ లాంగ్వేజ్‌ వర్డ్స్ 50శాతం అయినా ఉండాలి. 
 

ఇలా ఆస్కార్‌ నిబంధనల ప్రకారం ఉన్న సినిమాలను ఆస్కార్ కి పంపొచ్చు. అయితే అది కూడా అంత ఈజీ కాదు, కొన్ని వందల, వేల మెయిల్స్ ద్వారా సమాచారం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్స్ ద్వారా కొన్ని రోజుల పాట చర్చ అనంతరం అది ఆస్కార్‌ షార్ట్ లిస్ట్ కోసం పంపబడుతుంది. అలా వచ్చిన సినిమాలను ఆస్కార్‌ కమిటీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఏది ఆస్కార్‌కి వెళ్లాలనేది నిర్ణయిస్తారు. ఆస్కార్ కమిటీలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల మంది సభ్యులుంటారు. 
 

సినిమా రంగంలోని రాణిస్తున్న మేకర్స్, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు(24క్రాఫ్ట్స్ నుంచి) ఇందులో సభ్యులుగా ఉంటారు. మన ఇండియా నుంచి సుమారు 40 మంది ఆస్కార్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వారిలో అమితాబ్‌, షారూఖ్‌, సల్మాన్‌, అమీర్‌, కాజోల్‌, విద్యాబాలన్, సూర్య వంటి వారు సభ్యులుగా ఉన్నారు. వీరు ఓటింగ్‌ చేసి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అన్ని సినిమాల్లో రిమైండర్‌ లిస్ట్ ని తయారు చేస్తారు. అలా ఈ ఏడాది 300సినిమాలు షార్ట్ లిస్ట్ చేశారు. ఓటింగ్‌లో ఇది మొదటి స్టెప్‌. 

ఆ తర్వాత విభాగాల వారిగా ఓటింగ్‌ జరుగుతుంది. ఒక్కో విభాగం నుంచి ఉన్న సభ్యులు ఆయా విభాగంలో వచ్చిన సినిమాలను చూసి నచ్చిన సినిమాలకి ఓట్‌ చేస్తారు. అలా మరిన్ని సినిమాలు షార్ట్ లిస్ట్ అవుతాయి. వాటిలో నుంచి ఒక్కో విభాగంలో ఐదు సినిమాలను ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసింది ఆస్కార్‌ నామినేషన్స్. ఉత్తమ చిత్రం విభాగంలో తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో టాప్‌ 5 మూవీస్‌ని నామినేషన్‌కి ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన ఐదు సినిమాలను మళ్లీ పది వేల మంది ఓట్‌ చేసి బెస్ట్ కేటగిరిని ఫైనల్‌ చేస్తారు దానికి ఆస్కార్‌ అవార్డు దక్కుతుంది. 
 

అయితే ఈ ఓటింగ్‌ ప్రక్రియ కూడా పెద్ద ప్రాసెస్‌. ఉన్న అందరు సభ్యులు అన్ని సినిమాలు చూడటం సాధ్యం కాదు, బాగా నోటెడ్‌, బజ్‌ ఉన్న సినిమాలు, అందరి దృష్టి ఆకర్షించిన చిత్రాలనే చూస్తారు. అది కూడా వారికి ప్రత్యేకంగా స్క్రీనింగ్‌లు వేయాలి. వందల స్క్రీన్లు వేయాలి, వారికి మన సినిమా గురించి, దాని ప్రత్యేకతని గురించి వివరించాలి. అదే సమయంలో గెస్ట్ లను బాగా చూసుకోవాలి, వీటికే కోట్లు ఖర్చు అవుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి రాజమౌళి వందల కోట్లు ఖర్చు బెట్టారనే టాక్‌ వచ్చిన విషయం తెలిసిందే, అదంతా ఈ షోస్‌కి, గెస్ట్ లకు, పీఆర్ ని మెయింటేన్‌ చేయడం కోసం అయిన ఖర్చు.  అలా రాజమౌళి ప్రపంచ దిగ్గజ మేకర్స్ జేమ్స్ కామెరూన్‌, స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజ మేకర్స్ కి `ఆర్‌ఆర్‌ఆర్‌`ని చూపించి ప్రమోట్‌ చేయించాడు.
 

తమ సినిమాకి ఓటు వేయాలని ఆస్కార్‌ సభ్యులకు చిత్ర యూనిట్‌ వివరించాల్సి ఉంటుంది. వారిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు పీఆర్‌ ఏజెన్సీలు కొంత హెల్ప్ చేస్తాయి. వారికి భారీగానే ఖర్చు అవుతుంది. వాళ్లు ఆయా సినిమా గురించి పాపులర్‌ మేకర్స్ కి, టెక్నీషియన్ల వద్దకి తీసుకెళ్తారు, సినిమా గురించి మాట్లాడేలా చేస్తారు. అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తారు. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే సినిమా బడ్జెట్‌ కంటే ఆస్కార్ క్యాంపెయిన్‌ బడ్జెటే ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. చాలా మంది మేకర్స్ ఈ క్యాంపెయిన్‌ బడ్జెట్‌ పెట్టలేకనే పోటీ నుంచి తప్పుకుంటారు. దీంతో ఖర్చు పెట్టిన నిలబడ్డ సినిమాలే ఆస్కార్‌ పోటీలో ఉంటాయి. అలాంటి చిత్రాలకే అవార్డులు వస్తాయి. 

Image: Getty Images

ఖర్చు చేయకపోతే, సినిమాలో దమ్మున్నా, వేస్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి రాజమౌళి అండ్‌ టీమ్‌ భారీగా ఖర్చు చేసింది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచింది. అదే సమయంలో రాజమౌళి నెక్ట్స్ మహేష్‌తో ఇంటర్నేషనల్‌ రేంజ్‌ సినిమా చేయబోతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్‌ దాని మార్కెట్‌కి హెల్ప్ అవుతుంది. నెక్ట్స్ టైమ్‌ ఆస్కార్‌కి వెళ్లేందుకు ప్రాసెస్‌ ఈజీ అవుతుంది. ఇలా ముందస్తు భారీ స్కెచ్‌తోనే భారీ రిస్క్ తో, భారీ బడ్జెట్‌తో ఆస్కార్‌ పోటీలోకి దిగారు జక్కన్న. మరి ఆయన పోరాటం సక్సెస్‌ అవుతుందా? లేదా? అనేది చూడాలి. వీటితోపాటు డాక్యుమెంటరీ ఫిల్స్ ఆల్‌ దట్‌ బ్రీత్స్, ది ఎలిఫెంట్‌ విస్పరర్స్ కూడా ఆస్కార్‌కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. 
 

click me!