Chiru Leak: బాబీతో సినిమా టైటిల్ లీక్‌ చేసిన చిరంజీవి.. వామ్మో పవర్‌ఫుల్‌ టైటిల్‌?

Published : Aug 11, 2026, 09:35 PM IST

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో సినిమ రూపొందుతుంది. దీనికి టైటిల్‌ ని లీక్‌ చేశారు చిరంజీవి. తన పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్‌ రాబోతుందని, అందులోనే టైటిల్‌ రివీల్‌ అవుతుందన్నారు. మరి ఆ టైటిల్‌ ఏంటంటే?

PREV
14
బాబీతో మెగా 158 సినిమా చేస్తున్న చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `మెగా158` అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి కానుకగా దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో టీమ్‌ ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు చిరంజీవి. కెరీర్‌ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లని సాధించింది.

24
చిరంజీవి బర్త్ డే రోజు `మెగా 158 టీజర్

దీంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ కాంబినేషన్‌లో గతంలోనే `వాల్తేర్‌ వీరయ్య` సినిమా వచ్చింది. అది కూడా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. పెద్ద హిట్‌నిచ్చింది. ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు చిరంజీవి. ఈ మూవీ టైటిల్‌ లీక్‌ చేశాడు. చిరు లీక్స్ లో భాగంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈసందర్భంగా సినిమా టైటిల్‌, టీజర్‌ రాబోతుందని తెలిపారు. థమన్‌ ప్రస్తుతం దానికి వర్క్ చేస్తున్నారట. `కొరియన్‌ కనకరాజు` మూవీ సక్సెస్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు చిరంజీవి.

34
మెగా 158 మూవీ టైటిల్‌ లీక్‌ చేసిన చిరంజీవి

థమన్‌ తో మాట్లాడుతూ, ఈ నెల 22న టైటిల్‌ రివీల్‌ చేస్తున్నారుగా అన్నాడు చిరంజీవి, అవును సార్‌ అన్నాడు థమన్‌. టీజర్‌ లో వేస్తున్నారుగా అంటే అవును సార్‌, టీజర్‌ ఇస్తున్నారుగా అంటే అవును అన్నాడు. ఈ క్రమంలోనే టైటిల్‌ `కదిరి.. `లానే ఉంటుంది కదా అంటూ టైటిల్‌ లీక్‌ చేశారు చిరు. ఈ మూవీకి కదిరి అనే పేరుతో టైటిల్‌ పెట్టబోతున్నట్టు చిరు హింట్‌ ఇచ్చాడు. అయితే ఇది ఆయన నోరు జారడం కాదు, కావాలనే హింట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టైటిల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. `కదిరి` అని వదిలేశారు, సస్పెన్స్ లో పెట్టారు. అయితే `కదిరి అనేది కదిరి నరసింహ స్వామిగా పిలుస్తారు. అందులో భాగంగానే `కదిరి నరసింహ` అనే టైటిల్‌ పెట్టబోతున్నారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అవుతుంది. మరి ఇదేనా కాదా అనేది చూడాలి. కానీ ఇదే టైటిల్‌ అయితే మాత్రం సాలిడ్‌గా ఉంటుందని, సినిమాకది చాలా ప్లస్‌ అవుతుంది. టైటిల్‌ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు.

44
సత్యపై చిరంజీవి ప్రశంసలు

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన `కొరియన్‌ కనకరాజు` మూవీ ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్య, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుందట. సుమారు నలభై కోట్లు దాటి యాభై కోట్ల దిశగా వెళ్తుందని టాక్‌. ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ని మంగళవారం నిర్వహించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా హాజరై తన మూవీ టైటిల్‌ లీక్‌ చేశారు. ఇక `కొరియన్‌ కనకరాజు` మూవీ సక్సెస్‌ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభినందనలు తెలిపారు. సత్య కామెడీ హైలైట్‌గా చెప్పొచ్చు. మేర్లపాక గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఆయన విజన్‌కి వరుణ్‌ తేజ్‌ పిల్లర్‌లాగా నిలబడితే, సత్య బలమైన నిర్మాణం చేశారని, రితికి అందాలను అద్దిందని చెప్పారు చిరంజీవి. టాలీవుడ్‌లో ఇలా వరుసగా సినిమాలు విజయం సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories