రాంచరణ్ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాని రాజమౌళి యావరేజ్ సినిమాని అన్నారు. కలెక్షన్స్ పరంగా ఆ చిత్రం అనేక రికార్డులు సాధించింది. అయినా కూడా జక్కన్న ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో తన కీర్తిని పెంచుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. రాజమౌళి సినిమాలతో హీరోల రేంజ్ కూడా పెరుగుతోంది. ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు రాజమౌళి సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు.
25
టాలీవుడ్ సినిమాల కలెక్షన్స్
రాజమౌళి తరచుగా టాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ గురించి మాట్లాడుతుంటారు. మగధీర సినిమా ఆల్ టైం రికార్డు సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ నిర్మాణ సంస్థ కలెక్షన్స్ ఇంకాస్త ఎక్కువ చేసి చూపించడం అప్పట్లో రాజమౌళి కి నచ్చలేదు.
35
రాంచరణ్ రచ్చ సినిమా
ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి రాంచరణ్ రచ్చ సినిమా గురించి మాట్లాడారు. మగధీర తర్వాత రాంచరణ్ ఆరెంజ్ చేశారు. అది డిజాస్టర్ అయింది. వైవిధ్యంగా ప్రేమ కథ ప్రయత్నించడంతో వర్కౌట్ కాలేదు. దీనితో ఈ సారి రాంచరణ్ పక్కా మాస్ కథనే నమ్ముకున్నారు. అదే రచ్చ సినిమా. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళి వల్లే హీరోలకు క్రేజ్ పెరుగుతోంది అనే చర్చ రాగా జక్కన్న సున్నితంగా తిరస్కరించారు. అదే నిజమైతే రచ్చ సినిమా చూడండి. అది చాలా యావరేజ్ సినిమా. అయినా కూడా 45 కోట్ల వసూళ్లు ఎలా వచ్చాయి అని అన్నారు.
55
రాజమౌళి ఒపీనియన్
హీరోలకు కూడా సొంతంగా క్రేజ్ ఉంటుంది అనేది రాజమౌళి ఒపీనియన్. రచ్చ సినిమా కంటెంట్ పరంగా యావరేజ్ కావచ్చు. కానీ సంపత్ నంది ఆ మూవీలో అభిమానులు, మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ని చక్కగా చిత్రీకరించారు. ఫలితంగా అప్పట్లో రచ్చ మూవీ ఆల్ టైం టాప్ 3 గా నిలిచింది.