రాజమౌళి ఊహకందని మాస్టర్‌ ప్లాన్‌.. మహేష్‌ తో కమల్‌ హాసన్‌ ?.. నిజమైతే వెండితెర రణరంగమే ?

First Published | May 22, 2022, 7:25 PM IST

విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి సినిమాని ఓ శిల్పంలా చెక్కుతారు. అలాంటి వీరిద్దరు కలిసి సినిమా చేస్తే.. ఊహకందని ఆ మ్యాజిక్‌ త్వరలో సాధ్యం కాబోతుందా? 

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో మెప్పించిన రాజమౌళి(Rajamouli) ఇప్పుడు మహేష్‌బాబు(Maheshbabu)తో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇటీవలే మహేష్‌తో కథా చర్చలు జరిపారు రాజమౌళి. ఇక ఫైనల్‌ స్క్రిప్ట్ ని లాక్‌ చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి షూటింగ్‌ స్టార్ట్ చేయడమే మిగిలింది. ఏదేమైనా ఈ చిత్రం ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. 

రాజమౌళి సినిమా కోసమే మహేష్‌ (Rajamouli-Mahesh Movie) తన పూర్తి డేట్స్ ఇవ్వబోతున్నారు. దాదాపు రెండేళ్లు జక్కన్న సినిమాకే కేటాయించబోతున్నట్టు సమాచారం. ఈ లోపు త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమా షూటింగ్‌ని కంప్లీట్‌ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు మహేష్‌. 
 


ఇక రాజమౌళితో మహేష్‌ చేయబోయే సినిమా ఆఫ్రికన్‌ అడవుల బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచరస్‌గా సాగుతుందని ఆ మధ్య రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. అయితే పలు హాలీవుడ్‌ సినిమాల స్టయిల్‌లో ఈ చిత్రం ఉండబోతుందట. మహేష్‌ సాహసికుడిగా, అన్యాయంపై పోరాడే యోధుడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఇందులో మరో కీలక పాత్ర ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. బాలయ్య కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని రాజమౌళి తెలిపారు.

మహేష్‌ సినిమాలో మరో హీరో లేరు, మహేష్‌ ఒక్కరే హీరో అని తెలిపారు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రవితేజ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఇందులో కమల్‌ హాసన్‌(Kamal Haasan) ని నటింప చేయాలని ప్లాన్‌ చేశారట రాజమౌళి. బలమైన పాత్ర ఒకటి ఉందని, దానికి కమల్‌  అయితే పర్‌ఫెక్ట్ సూట్‌ అవుతుందని భావిస్తున్నారట. కమల్‌తో దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 
 

కమల్‌ హాసన్‌ అంటే నటనకు మారుపేరు. వెండితెరపై ఆయన నట విశ్వరూపం చూపిస్తారు. సరైన దర్శకుడు, సరైన పాత్ర పడితే వెండితెరని రక్తి కట్టిస్తారు. తన అద్భుతమైన నటనతో పులకరింప చేస్తారు. అలాంటి సందర్భాన్ని రాజమౌళి క్రియేట్‌ చేయబోతున్నారని భోగట్టా. జక్కన్న అంటే సినిమాని ఓ శిల్పంలా చెక్కుతారు. ఆయన వద్ద పనిచేస్తే హీరో కూడా నటనతో పర్‌ఫెక్షన్‌ పొందుతారు. అదే కమల్‌ లాంటి యూనివర్సల్‌ యాక్టర్‌ అయితే ఇక వెండితెరకి పూనకాలే అని చెప్పొచ్చు. మహేష్‌ లాంటి సూపర్‌స్టార్‌, కమల్‌ వంటి యూనివర్సల్‌ స్టార్‌ కలిస్తే బాక్సాఫీసు వద్ద రణరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 

మరి లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం కమల్‌.. రాజమౌళి-మహేష్‌ సినిమాలో చేస్తే, అది వెండితెర ఊగిపోవడం ఖాయమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` సినిమాలో నటించారు. ఇది జూన్‌ 3న విడుదల కానుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!