నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది హీరోయిన్ మళవికా మోహనన్. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ.. నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఆన్సర్ చేసింది బ్యూటీ.
మాళవికా మోహనన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చూస్తోంది. మాస్టర్ , పేట, మారన్ లాంటి సినిమాలలో నటించిన మాళవికా మోహనన్‌కు.. ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు.
27
గతంలో మలయాళ, కన్నడ, హిందీ సినిమల్లో నటించినప్పటికీ.. అక్కడ కూడా సరైన స్థాయిలో గుర్తింపు రాలేదు బ్యూటీకి. ప్రస్తుతం యుద్ర అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది మాళవికా. ఈ సినిమాతోనైనా బీటౌన్ లో మంచి పేరు వస్తుందన్న ఆశతో ఉంది మాళవిక.
37
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది సుందరి. హాట్ మాట్ ఫోటో షూట్స్ తో అందాలు ఆరబోస్తూ.. అదరగొడుతోంది. కుర్రళ్లకు మత్తెక్కించేలా అందాల ప్రదశ్నన చేస్తున్న మాళవిక.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తోచిట్ చాట్ లు కూడా చేస్తుంది.
47
తమిళంలో ధనుష్ తో కలిసి మారన్ సినిమాలో నటించింది మాళవిక. ఈ సినిమా తరువాత ఆమెకు కోలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతె ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉంది బ్యూటీ.
57
ఇక రీసెంట్ గా మాళవికా మోహనన్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిచింది. ఆ సమయంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాళవికకు షాక్ తగిలినంత పని అయ్యింది. మారన్ సినిమాలో హీరో ధనుష్ తో కలిసి నటించిన పడక సీన్ ఎన్నిసార్లు షూట్ చేశారంటూ ప్రశ్నించాడు నెటిజన్
67
ఈ ప్రశ్నతో ముందుగా షాక్‌కు గురైన మాళవిక ఆ తర్వాత తేరుకుని ఇలాంటి ప్రశ్న వేసిన మీ బుర్రలో ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతున్నాయి అంటూ గట్టిగా బదులిచ్చింది. దాంతో ఆ అభిమాని తోకముడిచాడు.
77
ఆమె సమాధానానికి పలువురు నెటిజెన్స్ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం మాళవిక సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.