టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 హీరోలు ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ

First Published | Oct 11, 2024, 1:34 PM IST

రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. 

దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ లో కూడా పెరిగింది. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించారు. ఈసారి రాజమౌళి ఏకంగా గ్లోబల్ మార్కెట్ పైనే కన్నేశారు. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ ప్రాజెక్టు గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

ఇదిలా ఉండగా రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ఎవరిది.. నంబర్ 1 హీరో ఎవరు అనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సీనియర్ అయ్యారు. ఆయన తర్వాతి తరం ఇప్పుడు రాణిస్తున్నారు. 


ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇలాంటప్పుడు ఎవరు నంబర్ 1 అనే చర్చ మొదలైంది. ముందుగా డైరెక్టర్స్ లో నెంబర్ 1 ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. దర్శకులలో ఫస్ట్ ర్యాంక్ అంటే మీదే కదా అని యాంకర్ ప్రశ్నించారు. అసలు దర్శకులకు ర్యాంకులు ఉండవు. నేను నంబర్ 1 అని అనుకోవడం లేదు అంటూ సున్నితంగా జక్కన్న తిరస్కరించారు. 

Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరికీ పోటీ..అందగాడు, గొప్ప నటుడు అయిన అతడిని కావాలనే తొక్కేశారా, ఎస్వీ రంగారావు కాదు

హీరోలకి ర్యాంక్స్ ఇవ్వాల్సి వస్తే ఎవరు నంబర్ 1 హీరో ? ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు ర్యాంకులు లేవు. నాకు తెలిసి టాలీవుడ్ లో నంబర్ 1 అంటే సీనియర్ ఎన్టీఆర్.. నంబర్ 2 అంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వాళ్ళ తరం ముగిసినట్లే. ర్యాంకులు అనేవి వాళ్ళతోనే ఆగిపోయాయి. ప్రస్తుతం జనరేషన్ లో హీరోలకు ర్యాంక్స్ ఇవ్వలేం అని..దాని గురించి చర్చే అనవసరం. ఎందుకంటే ఎవరికీ వారే భిన్నం అని రాజమౌళి తెలిపారు. 

రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. త్వరలో మహేష్ బాబుతో అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం చేయబోతున్నారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పని కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest Videos

click me!