అయితే నటన పరంగా ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ మూవీ బాహుబలి కాదని జక్కన్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఛత్రపతి చిత్రంలో ఒక సన్నివేశం మాత్రం నటన పరంగా ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అని రాజమౌళి అన్నారు. ఒక కామెడీ డైలాగ్ చెప్పి నవ్వించడం, ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టించడం, కోపం ప్రదర్శించడం చాలా సులభం. కానీ ఒకేసారి రెండు మూడు ఎమోషన్స్ ని మిక్స్ చేసి పేస్ లో చూపించగలడం, నటించడం అంత సులభం కాదు.