#Devara: ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్, ఎంత ఆవేదనతో అన్నారో

First Published | Oct 10, 2024, 8:05 AM IST

 బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దసరా  హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది

Ntr, Devara, koratala shiva,


జనాలు సినిమాలు చూసే తీరు మారింది అనేది నిజం. సోషల్ మీడియా వచ్చాక విపరీతమైన విశ్లేషణ, విమర్శ ప్రతీ సినిమాకు జరుగుతోంది. అసలు కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు నుంచే సినిమా ఫ్లాఫ్ డిజాస్టర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఇంపాక్ట్ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాల ఓపినింగ్స్ పైనా, వాటి భాక్సాఫీస్ ఫెరఫార్మెన్స్ పైనా పడుతోంది.

అంతెందుకు దేవర సినిమా రిలీజ్ కు ముందు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసారు. కొరటాల ఫామ్ లో లేడని, రాజమౌళి తో చేసాక ఎన్టీఆర్ ఖచ్చితంగా ఫ్లాఫ్ ఇస్తాడని ఇలాంటి కామెంట్స్ మొదలెట్టారు. రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చింది. ఇవన్నీ ఖచ్చితంగా ఎన్టీఆర్ ని బాధించే ఉంటాయి. ఈ నేపధ్యంలో దేవర సూపర్ హిట్ అయ్యాక మీడియా ప్రమోషన్స్ లో ఆడియన్స్ చూసే తీరు మారిందంటూ కామెంట్స్ చేసారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారు

Mental Health


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర ఊహకు అందని విధంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది.

కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.    సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసి దుమ్ము   లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దసరా  హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది.


Government doctor

 
ఇక ఈ చిత్రం సక్సెస్ అయ్యాక మేకర్స్ ఎరేంజ్ చేసిన  ఇండియా టుడే ఇంటర్వూలో  మాట్లాడారు ఎన్టీఆర్. తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ మనస్సు విప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.     ఎన్టీఆర్ మాట్లాడుతూ...ఆడియన్స్ ఈ రోజుల్లో చటాలా నెగిటివ్ గా మారిపోయారు. ఆడియన్స్ గా మేము ఎవరం సినిమాను అమాయకంగా చూసి ఎంజాయ్ చేయటం లేదు.  


“మా పిల్లలతో కలిసి సినిమా చూస్తూంటే వాళ్లు హీరో ఎవరు, సినిమా ఏమిటనేది అనవసరం, ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎందుకు  అంత అమాయికత్వంగా ఉండలేకపోతున్నాము. ప్రతీ సినిమా మనం ఈ రోజు విశ్లేషిస్తూ చూస్తున్నాము. జడ్జ్ చేస్తున్నాము, ఎక్కువగా  సినిమాల గురించే ఆలోచిస్తున్నాము.మనకు సినిమాలపై ఉన్న ఎక్సపోజర్ ఎక్కువ అవటమే కారణం కావచ్చు” అన్నారు. 
 


అయితే ఏదో రోజు తిరిగి రొటేటింగ్ సైకిల్ లో యధా స్దితికి చేరుకుంటాము. తిరిగి మామూలుగా సినిమాలు చూసే స్దితికి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆయన మాటల్లో ఆవేదన కనపడుతోందనేది నిజం. అలాగే ఎన్టీఆర్ చెప్పిన మాటల్లో అక్షరం కూడా అబద్దం లేదనేది నిజం. సోషల్ మీడియాలో ప్రతీ సినిమా విశ్లేషించబడుతోంది. విమర్శించబడుతోంది. వెక్కించబడుతోంది. 
 


 ఇక ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించి దేవర చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.  తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

Latest Videos

click me!