తెలుసా? : గొంతు మార్చి లేడీ వాయిస్ లో కమల్ పాడిన సాంగ్స్.. సూపర్ హిట్స్!

First Published Oct 10, 2024, 7:31 AM IST

నటుడిగా 60 ఏళ్లకు పైగా నట ప్రస్థానంలో కమల్  కొన్ని సినిమాలకు పాటలు పాడారు. కమల్ కు పాటలు రాయడం, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. 

kamal hassan, vikram, indian2


 ప్రయోగాలు, విభిన్నపాత్రలు ,గెటప్ లు అంటే మొదటగా గుర్తువచ్చేది కమల్ హాసన్. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపించే ఈ లోకనాయకుడుకు ఇప్పటికీ భాక్సాఫీస్ దగ్గర తిరుగులేదు. రీసెంట్ గా విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన వయస్సుతో సంభందం లేకుండా వరస సినిమాతో బిజీగా ఉంటున్నారు. యంగ్ హీరోలకు అన్ని విషయాల్లోనూ పోటీ ఇచ్చే ఆయన మల్టిటాలెంటెడ్  పర్శన్ కావటమే కలిసొచ్చే విషయం.

kamal hassan, vikram, indian2


కేవలం నటుడిగానే కాకుండా...దర్శకుడిగా, నిర్మాతగా ,స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇపుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీతో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు.  

ఈ లివింగ్ లెజండ్  కమల్ హాసన్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’,‘శుభ సంకల్పం’.. తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు. ఇవి చాలు.. నటుడిగా ఆయన స్టామినా ఏమిటో చెప్పడానికి. 

Latest Videos


kamal hassan, vikram, indian2


బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్,జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. తర్వాత భాషా బేధం పాటించకుండా నటుడిగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటించారు. 1960లో జెమినీ గణేశన్, మహానటి సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కలతూర్ కన్నమ్మ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కమల్ హాసన్.. తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు.

ఈ మూవీ సమయానికి కమల్ కి ఆరేళ్ళు వయసు మాత్రమే. ఇక ఈ సినిమాలో తన నటనతో రాష్ట్రపతినే మెప్పించారు.1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారీ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీలో తిరుగులేని కథానాయకుడిగా ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నారు. 


అంతేకాదు నటుడిగా 60 ఏళ్లకు పైగా నట ప్రస్థానంలో ఆయన కొన్ని సినిమాలకు పాటలు పాడారు. కమల్ కు పాటలు రాయడం, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. కమల్‌కు సంగీతంపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇలా కమల్ హాసన్ రెగ్యులర్ గా తన సినిమాలకే కాకుండా ఇతర నటీనటుల సినిమాలకు కూడా పాటలు పాడుతున్నారు. కమల్ ఇటీవల కార్తీ నటించిన మెయ్యళగన్ మరియు శివకార్తికేయన్ అమరన్ వంటి చిత్రాలకు పాటలు పాడారు.
 


రుక్కు రుక్కు సాంగ్
 అయితే చాలా మంది హీరోలు పాటలు పాడతారు. అందులో విశేషం ఏమి లేదు. అయితే కమల్ లేడీ వాయిస్ లోకి తన గొంతు మార్చి పాడటం మాత్రం రికార్డే. అలాగే ఆయన గొంతు మార్చి  ఆడ గొంతుతో తమిళంలో పాడిన పాటలు సూపర్ హిట్స్ కూడా. కమల్ హాసన్ 1996లో వచ్చిన అవ్వై షణ్ముఖి (తెలుగులో భామనే సత్యభామనే)  చిత్రంలో కూడా హీరోగా నటించారు.

సినిమాలో కమల్ 'రుకు రుకు' పాటను  నవ్వుతో పాడే సన్నివేశం ఉంటుంది. ఒరిజినల్ ఫీమేల్ సింగర్ లాగా కమల్ గొంతు మార్చి పాడారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆడ గొంతులో కూడా కమల్ శ్రుతి మార్పు లేకుండా పాడగలిగారు. ఈ పాటకు దేవా సంగీతం అందించాడు.
 


ముకుందా ముకుందా పాట

అలాగే కమల్ హాసన్ ఆడ గొంతులో పాడిన మరో పాట కూడా సూపర్ హిట్ అయింది. ఆ పాట దశావతారంలో కనిపించే ముకుందా ముకుందా పాట. హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటను సాధనా సర్గమ్ పాడారు. ఈ పాటలో కొన్ని సెకన్ల పాటు వృద్ధురాలు పాడుతున్నట్లుగా ఉంటుంది. కమల్ హాసన్ స్వయంగా ఆ బిట్ ని పాడారు. కమల్ ఆ వృద్ధురాలి క్యారెక్టర్‌లో నటించడమే కాకుండా తన గాత్రాన్ని కూడా మార్చి దానికి ఓ పాట పాడడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

click me!